Begin typing your search above and press return to search.

వారితో శ్రీలీల కష్టమేనా...?

గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీలీల టాలీవుడ్‌ యంగ్‌ స్టార్ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారుతుందని అంతా భావించారు

By:  Tupaki Desk   |   12 Jun 2024 5:06 AM GMT
వారితో శ్రీలీల కష్టమేనా...?
X

గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీలీల టాలీవుడ్‌ యంగ్‌ స్టార్ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారుతుందని అంతా భావించారు. గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆడక పోవడంతో పాటు శ్రీలీల పాత్ర గురించి కొందరు ట్రోల్స్ చేశారు. దాంతో శ్రీలీలకు స్టార్ హీరోల నుంచి పిలుపు రాలేదు.

పెద్ద సినిమాల్లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించాలనే ఉద్దేశ్యంతో అవకాశాల కోసం కొన్నాళ్లు వెయిట్ చేసిన ముద్దుగుమ్మ శ్రీలీల అటువంటి ఆఫర్లు దక్కక పోవడంతో వచ్చిన సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు.

హీరోయిన్‌ గా శ్రీలీల ప్రస్తుతం రవితేజ తో ఒక సినిమాను చేస్తుంది. ఇక పవన్‌ కళ్యాణ్‌ తో ఒక సినిమాను చేసేందుకు సైన్ చేసింది. పవన్‌ రాజకీయాలతో బిజీ అవ్వడం వల్ల ఆ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్‌ తో మూవీ చేస్తే, అది హిట్‌ అయితే ఇండస్ట్రీలో మంచి స్టార్‌డమ్‌ శ్రీలీలకు దక్కేది.

పవన్ మూవీ గురించిన ఊసే లేదు. మరో వైపు రవితేజ తో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుందో అనేది ఇప్పుడే చెప్పలేం. కనుక శ్రీలీల టాలీవుడ్‌ లో కొత్త ఆఫర్ల కోసం కొన్నాళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి శ్రీలీల కు చిన్న హీరోలతో మాత్రమే నటించే అవకాశాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఎంత వెయిట్‌ చేసినా చరణ్, ఎన్టీఆర్‌, బన్నీ, ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలను ఈ అమ్మడు దక్కించుకునేనా అంటే కష్టమే అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. రవితేజ తో చేస్తున్న సినిమా సూపర్‌ హిట్ అయ్యి, పవన్‌ తో కూడా సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ హీరోలు ఈమె వైపు చూసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.