Begin typing your search above and press return to search.

చార‌ల డిజైన్ లో శ్రీలీల కెవ్వుకేక‌

యంగ్ హీరోయిన్ శ్రీలీల నుంచి ఇన్ స్టాలో గ్లామ‌ర్ ట్రీట్ అనేది పెద్దగా క‌నిపించ‌దు. అమ్మ‌డు డీసెంట్ ఫోటోల‌తోనే ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 7:03 AM GMT
చార‌ల డిజైన్ లో శ్రీలీల కెవ్వుకేక‌
X

యంగ్ హీరోయిన్ శ్రీలీల నుంచి ఇన్ స్టాలో గ్లామ‌ర్ ట్రీట్ అనేది పెద్దగా క‌నిపించ‌దు. అమ్మ‌డు డీసెంట్ ఫోటోల‌తోనే ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఆన్ స్క్రీన్..ఆఫ్ ది స్క్రీన్ కి చిన్న‌పాటి వ్య‌త్యాసం చూపిస్తుంటుంది. సినిమాలో సీన్ డిమాండ్ చేస్తే! ఒకే కానీ ఫోటో సెష‌న్ల పేరుతో గ్లామ‌ర్ గా చూపిస్తానంటే! అలాంటి వాటికి నై అనే టైపు. చాలా రేర్ గా..ప‌రిమితంగానే గ్లామ‌ర్ గా క‌నిపిస్తుంటుంది.


అమ్మ‌డు ఎక్కువ‌గా అల్ట్రా మోడ్ర‌న్ దుస్తుల్లో డిజైన్ ని హైలైట్ చేస్తుంది త‌ప్ప‌! త‌న‌లో అందాల్ని మాత్రం ఆవిష్క‌రించ‌దు. చిట్టి పొట్టి దుస్తుల్లో ఆక‌ర్షిస్తుంది త‌ప్ప‌! అందాల ఆర‌బోత‌తో ప‌నేముంది? అంటుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో న్యూఫోటోతో ఇన్ స్టాలోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలో తెలుపు..న‌లుపు చార‌ల డిజైన్ తో కూడిన డిజైన‌ర్ దుస్తుల్లో ఒదిగిపోయింది. అమ్మ‌డి శ‌రీర సౌష్ట‌వానికి ఈ ఎంపిక ప‌ర్పెక్ట్ గా మ్యాచ్ అయింది.

ముఖానికి మ్యాక‌ప్..అంద‌మైన పెదాల‌పై లిప్ స్టిక్ మ‌రింత షైనింగ్ అవుతుంది. ఈ సెష‌ల్ లో బ్యూటీ కాళ్ల‌కు హైహీల్స్ ధ‌రించింది. బ్యాక్ గ్రౌండ్ లోకేష‌న్ బ్యూటీని మ‌రింత వైవిథ్యంగా ప్రోజ‌క్ట్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే బ్యూటీ 2.8 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ని క‌లిగిన బ్యూటీ ఈ పిక్ తో ఆ నెంబ‌ర్ ఇంకా పెరుగుతుంద‌నిపిస్తుంది.

ఇక శ్రీలీల కెరీర్ గురించి చెప్పేదేముంది. జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. బ్యాక్ టూ బ్యాక్ స‌క్స‌స్ లు శ్రీలీల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని శిలాశాస‌నం రాస్తుంది. గుంటూరు కారం స‌హా చేతిలో చాలా పెద్ద ప్రాజెక్ట్ లున్నాయి. అవ‌న్నీ రిలీజ్ త‌ర్వాత హిట్ అయితే శ్రీలీల దొర‌క‌డం క‌ష్ట‌మైన ప‌నే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల‌పై దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. న‌టిగా అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌.