బోయ్ ఫ్రెండ్ని మోసం చేసి మెసేజ్లు పంపే అమ్మాయి
ఇటీవలి కాలంలో ఆర్.ఎక్స్ 100, బేబి చిత్రాల కథాంశాలు యువతరంలో ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి.
By: Tupaki Desk | 31 Aug 2023 5:06 AM GMTఇటీవలి కాలంలో ఆర్.ఎక్స్ 100, బేబి చిత్రాల కథాంశాలు యువతరంలో ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి. దీనికి కారణం ఒక అమ్మాయి తన బోయ్ ఫ్రెండ్ ని లేదా ప్రేమికుడిని మోసం చేస్తే ఎలాంటి ఎమోషన్ పుడుతుంది అనే ఆసక్తికర ఎలిమెంట్.
ఒకవేళ అలాంటి సన్నివేశం ఎదురైతే సుహానా ఖాన్ అయితే ఏం చేస్తుంది? అంటే దానికి సమాధానం తనే స్వయంగా ఇచ్చింది. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తన డెబ్యూ మూవీ `ది ఆర్చీస్`ని ప్రమోట్ చేస్తోంది. సుహానా ఖాన్ ఈ చిత్రంలో వెరోనికా లాడ్జ్ పాత్రను పోషించింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది. తాజా ఇంటర్వ్యూలో సుహానా మాట్లాడుతూ .. తాను సినిమాలో పోషించిన పాత్ర టైప్ కాదు అని వెల్లడించింది. వోగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహానా ఖాన్ తన భాగస్వామిని మోసం చేయనని అంది. అదే పరిస్థితిలో వెరోనికా ఏం చేస్తుందనే దాని గురించి కూడా మాట్లాడింది. వెరోనికా ఇతర అబ్బాయిలకు స్వయంగా మెసేజ్లు పంపుతుంది! అని సుహానా చెప్పింది. ఎందుకంటే తన వెంట పడే అబ్బాయిల జాబితా చాలా పెద్దది అని వెల్లడించింది.
అయితే తాను నిజజీవితంలో వెరోనికా తరహా కానే కాదని సుహానా ఖాన్ తెలిపింది. నేను ఒంటరిగా ఉన్న అమ్మాయిని.. కాబట్టి నన్ను ఇష్టపడే అబ్బాయిని వదిలివేస్తాను.. అంటూ చిలిపిగా సమాధానమిచ్చింది. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో సుహానా ప్రేమలో ఉందంటూ ది ఆర్చీస్ చిత్రీకరణ సమయంలో బోలెడంత ప్రచారం సాగింది. అతడు ది ఆర్చీస్ లో ఆండ్రూస్ అనే పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో ఖుషీ కపూర్, అదితి సైగల్, వేదంగ్ రైనా, యువరాజ్ మెండా, మిహిర్ అహుజా తదితరులు నటించారు. ఇక ది ఆర్చీస్ త్వరలో విడుదల కానుంది. ఇంతలోనే కరణ్ జోహార్ సహా ప్రముఖ దర్శకనిర్మాతలు సుహానా కోసం కథల్ని రాసారు. కింగ్ ఖాన్ షారూఖ్ తో కలిసి సుహానా నటించనుందని కూడా కథనాలొచ్చాయి.