సన్నిలియోన్ పనులతోనే తల్లికి మద్యం అలవాటు!
శృంగార తారగా కెరీర్ ప్రారంభించిన సన్నిలియోన్ గతం గురించి తెలిసిందే. కుటుంబ పోషణ భారం కావడంతో సన్నిలియోన్ నీలి చిత్రాలపై అడుగులు వేసింది.
By: Tupaki Desk | 23 July 2023 10:31 AM GMTశృంగార తారగా కెరీర్ ప్రారంభించిన సన్నిలియోన్ గతం గురించి తెలిసిందే. కుటుంబ పోషణ భారం కావడంతో సన్నిలియోన్ నీలి చిత్రాలపై అడుగులు వేసింది. అటుపై జీవితాన్ని కొత్తగా మలుచుకోవడం సినిమాల్లోకి వచ్చింది. ప్రస్తుతం పోర్న్ స్టార్ అనే ముద్రని చెరిపేసుకుని సినిమా నటిగా కొనసాగుతోంది. డేనియల్ వెబర్ ని వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
ఇదంతా ఇప్పుడు.. ఒకప్పుడు సన్ని పరిస్థితులే వేరు. ఆ కుటుంబం జీవన విధానం వేరు. సన్నిలియోన్ బయోగ్రఫీ సినిమాగా చేస్తే పెద్ద సంచలనమే అవుతుంది. ఆమె కథలో కావాల్సినంత ఎమోషన్ ఉంది. తాజాగా సన్నిలియోన్ తన తల్లి గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేసింది. ఇంతకాలం తన ఆర్దిక కష్టాలే చెప్పుకొచ్చిన సన్ని తొలిసారి తల్లి గతాన్ని చెప్పుకుని వాపోయింది.
`అమ్మకు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. కానీ నేను పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే నా తల్లి మద్యానికి బానిసైందని కొంత వరకూ నేను భావిస్తాను. నేను ఇలాంటి సినిమాలు చేయడం అమ్మకు ఇష్టం లేక మందు తాగుంది అనుకునే దాన్ని. ఈ కారణాలతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. కానీ కాలక్రమంలో నా కంటే కూడా అమ్మకి మందే ఎక్కువ ఇష్టం అనుకునే దాన్ని. కానీ ఆమె ఇలా అవ్వడానికి నేను గానీ.. నా సోదరుడు గానీ..తండ్రి కాని బాధ్యులు కాము. పరిస్థితులు ఆమెను అలా లొంగదీసి ఉండొచ్చు.
ఇదొక మానసిక సమస్యగా తెలిసింది. చెడు అలవాట్లకు బానిసైతే తొందరగా ఎందుకు బయట పడలేరో ఆ తర్వాత అర్దమైంది. కుటుంబ పోషణ భారమవ్వడంతో నా వృత్తిలో నేను అలాగే పనిచేయాల్సి వచ్చేది. షూటింగ్ లంటూ రకరకాల ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఎన్నో వింత అనుభవాలు ఎదురయ్యేవి` అని తెలిపింది. సన్నిలియోన్ దంపతులు ఇండియాలో స్థిర పడిన సంగతి తెలిసిందే. కొంత మంది పిల్లల్ని దత్తత కూడా తీసుకున్నారు.