Begin typing your search above and press return to search.

ట‌బు ఆ హిందీ న‌టుడితో ఎందుకు నటించ‌లేదు?

కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన‌ పాత్ర‌ల‌తో అద్భుత న‌టిగా పాపుల‌రైంది ట‌బు. జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది

By:  Tupaki Desk   |   24 July 2024 3:30 AM GMT
ట‌బు ఆ హిందీ న‌టుడితో ఎందుకు నటించ‌లేదు?
X

కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన‌ పాత్ర‌ల‌తో అద్భుత న‌టిగా పాపుల‌రైంది ట‌బు. జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున స‌హా అటు హిందీ, త‌మిళంలోను అగ్ర హీరోల స‌ర‌స‌న ట‌బు న‌టించింది. కానీ ఒక ప్ర‌ముఖ న‌టుడి స‌ర‌స‌న అవ‌కాశాల్ని తిర‌స్క‌రించింది. ఆ ప్ర‌ముఖుడు మ‌రెవ‌రో కాదు.. కింగ్ ఖాన్ షారూఖ్‌. అత‌డితో అవ‌కాశాల్ని నిరభ్యంత‌రంగా తిర‌స్క‌రించాన‌ని ట‌బు తాజా ఇంట‌ర్వ్యూలో అంగీక‌రించింది. ఇదే ఇంట‌ర్వ్యూలో స్టార్ హీరోల అభ‌ద్ర‌తాభావం, అసుర‌క్షిత వ్య‌వ‌హారం గురించి కూడా న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

గ‌లాట్టా ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ.. అసురక్షిత నటీనటులతో మేనేజ్ చేయ‌డం గురించి మాట్లాడింది. సుర‌క్షిత‌మైన న‌టుల‌తో అని నేను చెప్పినా కానీ.. మీరు సురక్షితమైన సహ నటులతో ఆశీర్వాదాలు అందుకోన‌వసరం లేదు. అందుకే నీకు ఏది దొరికితే దానితో సరిపెట్టుకోవాలి! అంటూ ట‌బు ఈ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు.

ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్న‌ప్పుడు ఎవ‌రైనా స‌రే దానిని పూర్తి చేయాలి. సంతోషమో లేక దుఃఖ‌మో ప‌ని పూర్తి చేయాలి. మంచి అనుభవం లేదా చెడు అనుభ‌వం.. ఏదో ఒక‌టి.. ఆ ప్రాజెక్ట్ దానంతటదే పూర్తవుతుంది. ప‌ని విష‌యంలో మీ నిబద్ధత ముఖ్యం. సెట్లో మానసికంగా ఎలా వ్యవహరించారు? అది మీ జీవితంలోని ఇతర విష‌యాల‌ను ఎలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవాలి. నేను అన్ని రకాల వ్యక్తులను కలుసుకున్నాను. ఆద‌ర్శంగా ఉండేవారిని క‌లిసాను. మంచి వాతావరణాన్ని క‌లిగించే స్టార్లతో ప‌ని చేసాను. కానీ అభద్రత అనేది చాలా ప్రాథమిక మానవ భావోద్వేగమని నేను భావిస్తున్నాను! అని టబు న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు.

మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికి షాట్ లో న‌టించాల‌ని కాల్ రాగానే, స్క్రిప్ట్ రైటర్‌ని ప్రత్యేకంగా నా గురించి సీన్ రాయమని చెప్పలేను. అయితే నేను నచ్చితేనే ప్రాజెక్ట్‌ టేకప్‌ చేస్తాను. నాకు నచ్చకపోతే నిరాకరిస్తాను.. కానీ నా కోసం ఒక నిర్దిష్ట సన్నివేశాన్ని రాయమని నేను ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌ను కోర‌లేను అని కూడా ట‌బు అన్నారు.

షారుఖ్‌తో కలిసి ఎందుకు నటించలేదని ప్ర‌శ్నించ‌గా.. ట‌బు ఇలా అన్నారు. ``నేను నిర్మాతను కాదు.. దర్శకుడిని లేదా స్క్రిప్ట్ రైటర్‌ని కాదు. షారూఖ్ ఖాన్ ఎవరితో పని చేయాలో నేను డిక్టేట్ చేయడం లేదు. తదుపరి నాకు ఏ సినిమాలు ఆఫర్ చేస్తారు? అనేది ముఖ్యం. నాకు ఆఫర్ చేసిన వాటికి అవును లేదా కాదు అని మాత్రమే చెప్పగలను. షారుక్ ఖాన్ నుంచి కొన్ని ఆఫర్ లు వ‌చ్చాయి. నేను తిరస్కరించిన సినిమాలు ఏవో కూడా నాకు తెలుసు. ఖాన్ కూడా నాతో చేయాల్సిన‌వి కొన్ని చిత్రాలను తిరస్కరించారని భావిస్తున్నాను. కాబట్టి మా మార్గాల్లో మేం ఉన్నాం.. అని అన్నారు.

ఇటీవల స్లీపర్ హిట్ `క్రూ`లో భాగమైన టబు కెరీర్ జోష్ తో న‌డుస్తోంది. త‌దుప‌రి త‌న స్నేహితుడు అజయ్ దేవగన్‌తో కలిసి `ఆరోన్ మే కహా దమ్ థా`లో న‌టించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.