Begin typing your search above and press return to search.

50 ప్ల‌స్ లో 30 బ్యూటీలా ట‌బు మురిపం!

తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ పిక్ ని షేర్ చేసింది. ఇందులో షోల్డ‌ర్ లెస్ బ్లాక్ క‌ల‌ర్ గౌనులో త‌ళ‌కులీనింది. అమ్మ‌డి రూపం స‌హా శ‌రీర సౌష్టవంలో మార్పులొచ్చాయి.

By:  Tupaki Desk   |   11 July 2024 6:21 AM GMT
50 ప్ల‌స్  లో 30 బ్యూటీలా ట‌బు మురిపం!
X

సీనియ‌ర్ న‌టి ట‌బు సెకెండ్ ఇన్నింగ్స్ ని సైతం జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెట్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 'అల‌వైకుం ఠ‌పుర‌ము'తో టాలీవుడ్ లో కంబ్యాక్ అయిన త‌ర్వాత బాలీవుడ్ కెరీర్ మ‌రింత దేదీప్య‌మా నంగా సాగిపోతుంది. తెలుగులో కంటున్యూ కాలేదు గానీ బాలీవుడ్ లో మాత్రం మోతెక్కిస్తుంది. వ‌రుస గా హిందీ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఇటీవ‌లే 'ది క్రూ' తో మ‌రో భారీ విజ‌యం అందుకుంది. ఆ సినిమా 150 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో లేటు వ‌యసులోనూ ఘాటు వ‌సూళ్లు అనే కితాబు సొంతం చేసుకుంది.

ప్ర‌స్తుతం హిందీ లో మరికొన్నిప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయింది. ఇటీవ‌లే హాలీవుడ్ కి కూడా ప్ర‌మోట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అశేష ఫాలోయింగ్ ఉన్న డ్యూన్ సిరీస్ లో అవ‌కాశం అందుకుంది. అదే టైటిల్ కి ప్రోఫెసిని జోడించి భారీ బడ్జెట్ తో ఈ ప్రీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ట‌బు సిస్టర్ ఫ్రాన్సెస్ గా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీంతో ఇండియా వైడ్ ట‌బు పేరు మ‌రోసారి మోతెక్క‌డం మొద లైంది.

ఇక సోష‌ల్ మీడియాలో న‌వ నాయిలకు ఏమాత్రం తీసిపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కిస్తోన్న వైనం తెలిసిందే. 50 ఏళ్లు దాటినా అదే అందంతో హీటెక్కిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల్లో త‌న‌దైన శైలి ఎలివేష‌న్ల‌తో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ పిక్ ని షేర్ చేసింది. ఇందులో షోల్డ‌ర్ లెస్ బ్లాక్ క‌ల‌ర్ గౌనులో త‌ళ‌కులీనింది. అమ్మ‌డి రూపం స‌హా శ‌రీర సౌష్టవంలో మార్పులొచ్చాయి.

మునుప‌టి కంటే మ‌రింత యంగ్ లుక్ లో ఆక‌ర్షిస్తుంది. వ‌య‌సు మాత్ర‌మే 50...కానీ నేను 30 అంటూ అల‌రిస్తుంది. ఈ పిక్ ని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. 'జీవితంలో నేను చేసిన లేదా ఎంచుకున్న దేనినీ మార్చను. నేను ఎల్లప్పుడూ ఒక నిర్ధిష్ట‌మైన స్థలంలో ఉంటాను. మీరు ఆ స్థలాన్ని కనుగొనాలి' అంటూ ఇన్ స్పైరింగ్ కొటేష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ట‌బు ను చూసి అభిమానులు వావ్ అంటూ పొగిడేస్తున్నారు.