Begin typing your search above and press return to search.

త‌మ‌న్నాకి పోటీ కావాల్సిందే అంటోంది!

ఇందులో కీల‌క పాత్ర‌పోషించేది మాత్రం నిర్మాత‌ని మించి ద‌ర్శ‌కుడు అని చెప్పాలి. అత‌డి ఎంపిక తుదిగా ఉంటుంది

By:  Tupaki Desk   |   10 Jun 2024 5:39 AM GMT
త‌మ‌న్నాకి పోటీ కావాల్సిందే అంటోంది!
X

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల మ‌ధ్య పోటీ ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన పనిలేదు. ఒకే ఆఫ‌ర్ కోసం ముగ్గురు .. న‌లు గురు భామ‌లు పోటీ ప‌డుతున్నప్పుడు ఆ ఛాన్స్ ఎవ‌రికి వ‌రిస్తుందా? అని ఉత్కంఠ నెల‌కొంటుంది. ఈ క్ర‌మంలో ఎవ‌రికి వారు సొంత ప్ర‌య‌త్నాలు చేస్తారు. ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌తో త‌మ‌కున్న ప‌రిచాల‌తోనూ చేజిక్కించుకోవ‌డానికి చూస్తారు. ఎక్కువ‌గా ఈ ర‌కంగానే భామ‌ల మ‌ధ్య పోటీ ఏర్ప‌డిన‌ప్పుడు ఛాన్స్ వ‌న్ సైడ్ అవుతుంది.

ఇందులో కీల‌క పాత్ర‌పోషించేది మాత్రం నిర్మాత‌ని మించి ద‌ర్శ‌కుడు అని చెప్పాలి. అత‌డి ఎంపిక తుదిగా ఉంటుంది. హీరోల ఇన్వాల్వ్ మెంట్ అన్న‌ది కూడా ఉంటుంది. కానీ అన్ని సినిమాల‌కు అలా జ‌ర‌గ‌దు. ఈ క్ర‌మంలో వాళ్ల నుంచి కూడా హీరోయిన్లు ఛాన్సులంద‌కుంటార‌నే వాద‌న ఉంది. ఈ విష‌యంలో హీరోయిన్ల మ‌ధ్య అప్పుడ‌ప్పుడు త‌గాదాలు..మ‌న‌స్ప‌ర్ద‌లు త‌లెత్తిన సందార్భాలు కోకొల్లలు.

కొన్నాళ్ల క్రితం అజిత్ న‌టించిన సినిమా విష‌యంలో త్రిష‌-అనుష్క మ‌ధ్య పెద్ద యుద్ద‌మే జ‌రిగింది. అజిత్ స‌ర‌స‌న ఎవ‌రు కీల‌క‌పాత్ర ధారి అన్న పాయింట్ పై ఇరువురి మ‌ధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో వార్ జ‌రిగింది. ఆ త‌ర్వాత ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే వెలుగులోకి వ‌చ్చాయి. తాజాగా ఈ అంశంపై మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న అభిప్రాయాన్ని పంచుకుంది. అదేంటో ఆమె మాట‌ల్లోనే..

'ఒక చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఒకరితో ఒకరిని పోల్చి మాట్లాడటం సహజం. కొందరు ఇద్దరు హీరోయిన్ల మధ్య పోటీ ఉందంటారు. కానీ, నా విషయానికి వస్తే హీరోయిన్ల మధ్య పోటీ ఉండటం ఎంతో అవసరం. అయితే ఈ పోటీ ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలి. సినిమా పరిశ్రమలో పోటీ ఉన్నప్పటికీ మనం.. మనంలాగే నటిస్తే చాలు. 'అరణ్మనై-4' చిత్రంలో నేను, రాశీఖన్నా ఒక పాటకు కలిసి డ్యాన్స్‌ చేశాం. అపుడు ఒకరికి ఒకరు అండగా నిలిచాం. అందువల్ల హీరోయిన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం ఎంతో మంచిది' అని తెలిపింది.