Begin typing your search above and press return to search.

సొంత దుకాణంలో న‌గ‌లు వేసుకోని త‌మ‌న్నా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Aug 2023 12:30 AM GMT
సొంత దుకాణంలో న‌గ‌లు వేసుకోని త‌మ‌న్నా!
X

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ కొత్త జ‌ర్నీ సాగిస్తుంది. ఇప్ప‌టికే వెంక‌టేష్..చిరంజీవి లాంటి స్టార్స్ తో రొమాన్స్ చేసింది. బాల‌కృష్ణ‌..నాగార్జున లాంటి సీనియ‌ర్ల‌తోనూ ప‌నిచేస్తే దాదాపు అన్ని తరాల్ని క‌వ‌ర్ చేసిన హీరోయిన్ జాబితాలో చేరిపోతుంది. ఇక అమ్మ‌డు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంలో దిట్ట అని కెరీర్ ఆరంభంలోనే నిరూపించుకుంది.

ఓ వైపు సినిమాలు..మ‌రో వైపు బ్రాండింగ్స్ ని ఎండార్స్ చేస్తూ రెండు చేతులా సంపాద‌నే ఆ నాడే ప్రారం భించింది. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా యాడ్స్ మాత్రం త‌ప్ప‌కుండా చేసేది. వాటి ద్వారానే కోట్ల ఆదాయం స‌మకూరేది. అందులోనూ బంగారు ఆభ‌ర‌ణాల ప్ర‌చార కార్య‌క్రమాల్లో త‌మ‌న్నా ఎంత అందంగా మెరిసిపోయేదో చెప్పాల్సిన ప‌నిలేదు. ఒళ్లంతా బంగారం తో నింపేసిన ఎన్నో ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించింది. త‌మ‌న్నా చీర క‌ట్టి...బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించిందంటే? ఆ ఆభ‌ర‌ణాల‌కే వ‌న్నె వ‌చ్చేది.

మ‌రి త‌మ‌న్నా రియ‌ల్ లైఫ్ లో బంగారం ధ‌రిస్తుందా? అంటే వాటి జోలికే పోదుట‌. అవును ఈ విష‌యాన్ని త‌మ‌న్నా స్వ‌యంగా తెలిపింది. త‌మ‌న్నా తండ్రికి సొంతంగా బంగారు ఆభ‌ర‌ణాల దుకాణాలే ఉన్నాయట‌. వాటిలో ర‌క‌ర‌కాల డిజైన్లు..మోడ‌ల్స్ ఉంటాయ‌ట‌. కానీ వాటిని ఏ రోజు ధ‌రించ‌లేదుట‌. త‌ల్లిదండ్రులు బంగారంతో వేసుకోని బ‌య‌ట‌కు వెళ్ల‌మంటే అస్స‌లు ఒప్పుకునేది కాద‌ట‌.

త‌న‌కిష్ట‌మైన లంగావోళి ధ‌రించిన‌ప్పుడైనా వేసుకోమ‌ని బ్ర‌తిమలాడుతారుట‌. కానీ స‌సేమీరా ఒప్పుకోదుట‌. కానీ సంపాద‌న కోసం బ‌య‌ట దుకాణాల్లో బంగారం ఒళ్లంతా ధ‌రించాల్సి వ‌స్తుంద‌ని తెలిపింది. త‌మ‌న్నా ఇటీవ‌లే రిలీజ్ అయిన `జైల‌ర్`..`భోళా శంక‌ర్` సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు అగ్ర హీరోల‌తో క‌లిసి న‌టించిన సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వ‌డం విశేషం. అయితే జైల‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్నా..భోళా శంక‌ర్ మాత్రం విమ‌ర్శ‌ల‌పాలైంది. ఇందులో అమ్మ‌డు చిరంజీవికి జంట‌గా న‌టించింది. హిట్ అయితే త‌మ‌న్నా ర్యాకింగ్ లోనూ మార్పు వ‌చ్చేది.