Begin typing your search above and press return to search.

టాప్ హీరోయిన్ల టాటూ స్టోరీస్

టాటూ ట్రెండ్ ఈనాటిది కాదు. ద‌శాబ్ధాలుగా ప‌చ్చ‌బొట్ల సంస్కృతితో భార‌తీయుల‌కు ప‌రిచ‌యం ఉంది

By:  Tupaki Desk   |   20 May 2024 9:30 AM GMT
టాప్ హీరోయిన్ల టాటూ స్టోరీస్
X

టాటూ ట్రెండ్ ఈనాటిది కాదు. ద‌శాబ్ధాలుగా ప‌చ్చ‌బొట్ల సంస్కృతితో భార‌తీయుల‌కు ప‌రిచ‌యం ఉంది. అయితే సెల‌బ్రిటీల వ‌ల్ల ఈ సంస్కృతికి అద్బుత ప్ర‌చారం ద‌క్కుతోంది. ఇటీవ‌లి కాలంలో పాపుల‌ర్ క‌థానాయిక‌లు ప్ర‌త్యేకించి టాటూ (ప‌చ్చ‌బొట్లు) పై ఎంతో మోజు చూపిస్తున్నారు. నేటిత‌రం న‌టీమ‌ణులు రెగ్యుల‌ర్ గా త‌మ‌ టాటూల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటే, నాటి మేటి త‌రం కూడా టాటూల‌తో హాట్ టాపిగ్గా మారుతున్నారు.

ఇటీవ‌ల క‌థానాయిక‌ల ఫ్యాష‌న్ సెన్స్ అల‌వాట్ల‌పై నిరంత‌రం ఆన్ లైన్ లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం ట్రెండీ టాటూ క‌ల్చ‌ర్ పైనా ఆన్ లైన్ లో డిబేట్ న‌డుస్తోంది. టాలీవుడ్ అగ్ర క‌థానాయిక స‌మంత త‌న న‌డుపు పై భాగంలో టాటూ వేయించుకుని చాలా కాలం పాటు మెరుపులు మెరిపించింది. వైఎంసి అని టాటూ వేయించుకుంది. ఏమాయ చేశావేకు ఇది షార్ట్ ఫామ్. బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ ఎక్కువ‌గా ఫొటో షూట్ల‌లో టాటూని హైలైట్ చేస్తుంది. త‌న మెడకి బాగా కింద వైపు టాటూ వేయించుకుని యువ‌తరాన్ని ఆక‌ర్షిస్తుంది. రష్మిక మంద‌న్నా త‌న కుడిచేతిపై టాటూతో ముచ్చ‌ట ప‌డుతోంది.

సీనియ‌ర్ బ్యూటీ త్రిష‌కు ఈ టాటూల పిచ్చి మ‌రీ ఎక్కువ‌. ఈ బ్యూటీ తన చేతి మీదనే కాదు వీ షేప్ వ‌ద్దా టాటూ వేయించుకుని .. టాటూల‌పై త‌న మ‌న‌సును చాటుకుంది. కమ‌ల్ హాస‌న్ గారాల‌ప‌ట్టి శ్రుతిహాసన్ వెస్ట్ర‌న్ స్టైల్ ని ఇష్ట‌ప‌డుతుంది. గోథిక్ మేక‌ప్ తో పాటు టాటూల‌పై త‌న‌కు ఎంత మ‌మ‌కారం ఉందో నిరూపించింది. త‌న వీపు.. మెడ భాగాల్లో టాటూలు వేయింకుని మ‌రీ ఈ అమ్మ‌డు మురిసిపోతోంది. న‌య‌న‌తార‌- ప్రియ‌మ‌ణి- తాప్సి- ఇలియానా- చార్మి టాటూల‌తో కుర్ర‌కారు మ‌న‌సులో గిలిగింత‌లు పెట్టిన వారి జాబితాలో ఉన్నారు.

ఆ టూటూల‌కు మీనింగ్ తెలుసా?

దీపిక ప‌దుకొనే 82 డిగ్రీ ఇ అనే టాటూ వేయించుకుంది. 82 డిగ్రీల ఈస్ట్ అనేది దీన‌ర్థం. ఇది స్కిన్ కేర్ బ్రాండ్ పేరు. అంత‌కుముందు ఆర్.కే అనే అక్ష‌రాల‌ను టాటూగా వేయించుకుంది. ర‌ణ‌బీర్ క‌పూర్ అని దీన‌ర్థం. కానీ ర‌ణ‌బీర్ తో బ్రేక‌ప్ అయ్యాక దీపిక‌ ఆ టాటూను చెరిపేసింది. స‌మంత కూడా చై అనే టాటూ వేయించుకుంద‌ని దానిని రిమూవ్ చేసింద‌న్న టాక్ కూడా ఉంది. ఫ‌రియా అబ్ధుల్లా కాలిపై చెట్టు వేర్లు టాటూగా క‌నిపిస్తాయి. అయితే ప్ర‌తి మ‌నిషికి రూట్స్ ముఖ్యం అనేది ఫ‌రియా భావ‌న అని తెలిసింది. ర‌ష్మిక కాలేజ్ రోజుల్లోనే irreplaceable (ఏదీ మార్చ‌లేం) అనే టాటూని వేయించుకున్నారు. జాన్వీ క‌పూర్ 'ఐ ల‌వ్ యు ల‌బ్బూ' అనే టాటూ వేయించుకున్నారు. దీనిని శ్రీ‌దేవి ఎంతో ప్రేమ‌తో ఒక పేప‌ర్ పై రాసిచ్చార‌ట‌. న‌య‌న‌తార చేతిపై ఉన్న టాటూ మీనింగ్ పాజిటివిటీ. కోలీవుడ్ మీడియా దీనిని డీకోడ్ చేసింది. ప్రియా వారియ‌ర్ ఛాతీపై 'సీజ్ ది డే' అనే టాటూతో కనిపిస్తుంది. చేతిపైనా ఒక టాటూ ఉంది.