త్రిష కిస్సుకు నో చెప్పిన స్టార్ హీరో..!
లవ్ స్టోరీలు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఎందుకంటే, ప్రేమ కథలో హీరో , హీరోయిన్ల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ ముఖ్యంగా ముద్దు సీన్లను ప్రేక్షకులు ఎక్కువగా ఆస్వాదిస్తారు.
By: Tupaki Desk | 11 Sep 2023 3:00 AM GMTలవ్ స్టోరీలు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఎందుకంటే, ప్రేమ కథలో హీరో , హీరోయిన్ల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ ముఖ్యంగా ముద్దు సీన్లను ప్రేక్షకులు ఎక్కువగా ఆస్వాదిస్తారు. ఈ మధ్యకాలంలో యాక్షన్ సీన్స్ లోనూ రొమాంటిక్ సీన్స్ కామన్ అయిపోయాయి. ఇక ఘాటు ముద్దుల గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక, చాలా మంది హీరోలు రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోతారు. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే, పాన్ ఇండియా స్టార్ విజయ్ సేతుపతి మాత్రం అలాంటి అవకాశం వస్తే వదులుకున్నారు. విజయ్ సేతుపతి ఎలాంటి రోల్స్ అయినా చేయగలరు. ఓ వైపు హీరో రోల్స్ చేస్తుంటారు. మరోవైపు విలన్ రోల్స్ కూడా చేస్తూ మెప్పిస్తూ ఉంటారు.
అయితే, కొంతకాలం క్రితం ఆయన హీరోయిన్ త్రిష తో కలిసి 96 అనే మూవీలో నటించారు. ఇది కంప్లీట్ గా లవ్ స్టోరీ. పదో తరగతిలో ప్రేమించుకున్న జంట తర్వాత విడిపోతారు. అలా విడిపోయిన వాళ్లు దాదాపు పదేళ్ల తర్వాత గెట్ టూ గెదర్ లో కలుసుకుంటారు. ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. దీనిని తెలుగులో జాను పేరిట రీమేక్ చేశారు. కానీ, 96 క్లిక్ అయ్యినంత ఇది మాత్రం క్లిక్ కాలేదు. అయితే, ఈ మూవీలో చివరలో త్రిష, విజయ్ దేవర కొండను వదిలేసి వెళ్లిపోవాలి.
ఎయిర్ పోర్టులో చివరగా వీడ్కోలు చెప్పే సమయంలో చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ హగ్ చేసుకుంది. ఇది పూర్తిగా ప్రేమ కథ అయినప్పటికీ ఒక్కటి కూడా రొమాంటిక్ సీన్ ఉండదు. కానీ, డైరెక్టర్ మాత్రం ఈ మూవీ క్లైమాక్స్ లో ఓ ముద్దు సీన్ పెట్టాలని అనుకుంటున్నారట. త్రిష వెళ్లిపోయే ముందు వచ్చి, లిప్ లాక్ ఇవ్వాలి. ఈ ముద్దు ఇవ్వడానికి త్రిష కూడా అంగీకరించిందట. కానీ, విజయ్ సేతుపతి మాత్రం ఆ సీన్ చేయడానికి అంగీకరించలేదట.
ఆయన అంగీకరించకపోవడంతో, ఆ సీన్ లేకుండానే సినిమా పూర్తి చేసేశారు. అయితే, ఆ సీన్ లేకున్నా, వారిద్దరూ కేవలం తమ కళ్లతోనే నటించి, మూవీ ని మరింత హైలెట్ గా నటించారు. ఇదిలా ఉండగా, విజయ్ సేతుపతి రీసెంట్ గా జవాన్ మూవీ లో విలన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.