Begin typing your search above and press return to search.

త్రిష.. స్పీడ్ మామూలుగా లేదు

సౌత్ ఇండియన్ లో సీనియర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ త్రిష.

By:  Tupaki Desk   |   14 Sep 2023 5:45 AM GMT
త్రిష.. స్పీడ్ మామూలుగా లేదు
X

సౌత్ ఇండియన్ లో సీనియర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ త్రిష. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తయ్యింది. ఇప్పటికి వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. సీరియర్ కేటగిరీలోకి వెళ్లిపోయే హీరోయిన్స్ కెరియర్ కూడా ముగింపు దశకి వచ్చేస్తూ ఉంటుంది. త్రిషకి కూడా ఒకానొక దశలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

తెలుగులో అయితే ఆమెకి ఛాన్స్ లు లేనట్లే చెప్పాలి. ఒక వేళ అవకాశం వచ్చిన సీనియర్ హీరోలకి జోడీగానే చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో చేసిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ త్రిషకి కెరియర్ పరంగా చాలా హెల్ప్ అయ్యింది. ఈ మూవీలో అనే నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. దీంతో ఈ బ్యూటీకి మళ్ళీ అవకాశాలు కూడా అమాంతం పెరిగాయి.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న లియో మూవీలో త్రిష లీడ్ రోల్ లో నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే లోకేష్ త్రిషకి ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

తాజాగా అజిత్ కుమార్ 62వ సినిమాలో కూడా కథానాయికగా త్రిష ఎంపికైంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ చిత్రం తెరకెక్కనుంది. మలయాళంలో టోవినో థామస్ హీరోగా తెరకెక్కుతోన్న ఐడెంటిటీ అనే మూవీలో త్రిష లీడ్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది.

ఇలా తమిళ్, మలయాళంలో మూడు సినిమాలతో త్రిష మంచి ఫామ్ లో ఉందని చెప్పాలి. ఈ సినిమాలు సక్సెస్ అయితే మాత్రం తరువాత మరింత బిజీ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అలాగే డిజిటల్ ఎంట్రీ కోసం కూడా త్రిష వెయిట్ చేస్తోంది. మంచి కథ దొరికితే చేయడానికి సిద్ధంగా ఉంది. మరి సీనియర్ నటి ఎంతకాలం ఇదే ఫామ్ కొనసాగిస్తుందనేది చూడాలి.