నిమిషానికి కోటి.. బిల్డప్ ఇచ్చి బుక్కయిన నటి
సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ ఊర్వశి రౌతేలాకు కొత్తేమీ కాదు. క్రికెటర్ పంథ్ తో వివాదం మొదలు, రకరకాల తప్పుడు వ్యాఖ్యలతో తరచుగా కనికరంలేని ట్రోలింగ్‌కు గురవుతోంది.
By: Tupaki Desk | 31 Aug 2023 5:09 AM GMTసామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ ఊర్వశి రౌతేలాకు కొత్తేమీ కాదు. క్రికెటర్ పంథ్ తో వివాదం మొదలు, రకరకాల తప్పుడు వ్యాఖ్యలతో తరచుగా కనికరంలేని ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇప్పుడు మరోసారి ఊర్వశి రౌతేలా తీవ్రమైన ఎగతాళికి గురైంది. ఊర్వశి తాజా వ్యాఖ్యలు దీనికి కారణం. ఆమె తాజా వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై లెక్కలేనన్ని జోకులు చెత్త కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
నిమిషానికి ఒక కోటి వసూలు చేస్తూ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటి మీరు.. దీనిపై మీరు ఏమని మాట్లాడతారు? అంటూ ఊర్వశి రౌతేలాను ఒక విలేఖరి కోరడంతో అసలు రచ్చ మొదలైంది. విలేఖరి ప్రకటనను నిజమేనని ధృవీకరిస్తూ ఊర్వశి రౌతేలా ఇలా అన్నారు. ``ఇది మంచి విషయం.. ప్రతి స్వీయ-నిర్మిత నటుడు/నటి అలాంటి ఒక రోజును చూడాలని కోరుకుంటారని భావిస్తున్నాను`` అని వ్యాఖ్యానించింది.
ఈ వీడియోకు ప్రతిస్పందనగా నెటిజనులు దారుణంగా ఎగతాళి చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, ``ఆగండి .. ఆమెకు అంత డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు? మరీ ముఖ్యంగా ఆమెను ఎవరు చూస్తారు? lol`` అంటూ కామెంట్ చేసాడు. నేను ప్రతిరోజూ కోటీశ్వరుడినని కలలు కంటున్నాను కూడా అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా... ఆమె మాట్లాడుతోంది సరే కానీ.. పని ఎక్కడ ఉంది? మనకు ఆమాత్రం తెలియదా? అని ఒకరు కామెంట్ చేయగా..``ఇంతకీ ఆమె ఎక్కడ నటిస్తోంది?`` అని మరొకరు జోక్ వేసారు.
గత సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాలీవుడ్ సూపర్ స్టార్ లియోనార్డో డికాప్రియో తనను పొగిడాడని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న తర్వాత ఊర్వశి రౌతేలా ఇదే తీరుగా తీవ్రంగా ట్రోలింగుకి గురైంది. దానికి కారణం ఊర్వశి అబద్ధపు మాటలు. ``నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను.. నా కళ్లలో సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి. అదే సమయంలో నేను ఎరుపెక్కాను..`` అంటూ డికాప్రియో పొగడ్తల గురించి తెలిపింది. చాలా టాలెంటెడ్ నటి అని కూడా నన్ను మెచ్చుకున్నారు. నేనే చిటికెలు వేస్తూ లేచాను. ఇది నిజంగా నిన్న రాత్రి జరిగిందా? నేను అలాంటి మధురమైన క్షణం గురించి కలలు కంటున్నానా? యువ నటులకు ఇది ప్రేరణనిస్తుందని నేను భావిస్తున్నాను..అతనిని కలుసుకున్న నా జ్ఞాపకం… లియోనార్డో డికాప్రియో నుండి అభినందనలు అందుకున్న తర్వాత నేను ఆ అనుభవాన్ని ఎలాంటి పదాలతో వర్ణించాలో తెలియక విసుగెత్తాను`` అని కూడా వ్యాఖ్యానించింది.
అయితే ఊర్వశి రౌతేలా వినిపించిన కథను ఎవరూ నమ్మలేదు. దానిని ట్రోల్ చేస్తూ నెటిజనులు విరుచుకుపడ్డారు. మీమ్ ఫెస్ట్ అసాధారణంగా కొనసాగింది. ``నేను ఊర్వశి రౌతేలాను నిజంగా ఆరాధిస్తాను.. ఎందుకంటే ఆమె అబద్ధం చెప్పినా పట్టించుకోవద్దు.. ఆమె అబద్ధమే చెబుతోంది`` అని ఒక అభిమాని ఎగతాళి చేసాడు. ఊర్వశి రౌతేలా తదుపరి దిల్ హై గ్రే - బ్లాక్ రోజ్ చిత్రాల్లో కనిపించనుంది.