ఆమెకి ఏడు సార్లు పెళ్లి చేసుకోవాలని ఉందట!
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఐటం సాంగ్స్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటెలా
By: Tupaki Desk | 10 Sep 2023 4:30 PM GMTబాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఐటం సాంగ్స్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటెలా. ఈ అమ్మడు తాజాగా పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొందరు ఈమె వ్యాఖ్యలను వక్రీకరిస్తూ విమర్శలు చేస్తూ ఉంటే కొందరు మాత్రం సమర్ధిస్తున్నారు.
ఇటీవల ఒక చిట్ చాట్ లో ఊర్వశి మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో చాలా మంది నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటూ ప్రశ్నిస్తున్నారు. నా పెళ్లి ఎప్పుడు అని అడుతున్న వారికి చెప్పడానికి నా వద్ద సమాధానం లేదు. ఎప్పుడు అనే విషయం లో నేను ఇంకా ఒక క్లారిటీకి రాలేదు అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.
పెళ్లి ఎప్పుడు అనేది క్లారిటీ లేదు కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఉంది. అయితే పెళ్లి చేసుకునే విషయం లో మాత్రం కొన్ని కోరికలు తనకు ఉన్నాయి అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఏడు విధాలుగా పెళ్లి చేసుకోవాలని తాను కోరుకుంటున్నట్లుగా ఊర్వశి చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఏడు రకాలుగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న తాను ఒక సారి బీచ్ లో అహ్లాదకరమైన వాతావరణం లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ తర్వాత బెంగాలీ సాంప్రదాయం లో ఒక సారి పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత క్రూజ్ లో ఒక సారి, హిందూ ఇంకా క్రైస్తవ సాంప్రదాయాల్లో ఒక సారి అలాగే థీమ్ బేస్డ్ పెళ్లి చివరగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లుగా ఆమె పేర్కొంది.
ఒకరు సాధారణంగా అయితే రెండు మూడు రకాలుగా పెళ్లి చేసుకుంటారు. కానీ ఈమె ఏకంగా ఏడు రకాలుగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఏడు సార్లు పెళ్లి చేసుకోవడం అంటే దాదాపు అసాధ్యం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. ఏడుగురిని వివాహం చేసుకుంటే ఇది సాధ్యమేమో అన్నట్లుగా కొందరు కామెడీ చేస్తున్నారు.