ఇలాంటి వారి మధ్య పనిచేస్తున్నామంటే భయమేస్తుంది!
జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇప్పుడు మాలీవుడ్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Aug 2024 6:48 AM GMTజస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇప్పుడు మాలీవుడ్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకాలం మౌనంగా ఉన్న బాధితులంతా ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. మాకు అన్యాయం జరిగిందంటూ! తమ బాధను వెల్లుబుచ్చుతున్నారు. అవి అరోపణలా? వాస్తవాలా? అన్నది తేల లేదిగానీ మాలీవుడ్ మాత్రం ఈ రకమైన ఆరోపణలతో దేశ వ్యాప్తంగా సంచలనమైంది.
మాలీవుడ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో లైంగిక వేధింపులకు అడ్డాగా మారిందా? అని అంతా నివ్వెర పోతున్నా రు. ఇటీవలే సీనియర్ నటి రేవతి సంపత్ ఆరోపణలతో మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పవికి సందీప్ సిద్ధిఖీ రాజీనామా చేశారు. తాజాగా హేమ కమిటీ నివేదిక పై సీనియర్ నటి ఊర్వశి ఆసక్తికర వ్యాఖ్‌యలు చేసారు. `జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ గురించి విని షాకయ్యాను.
నాలాంటి ఎంతోమంది మహిళలు జీవనోపాధి కోసం సినిమాల్లో పని చేస్తున్నాం. కానీ ఇలాంటి వారి మధ్య పని చేస్తున్నామని తెలిసి బాధగా ఉంది. భయమేస్తోంది. వ్యక్తిగతంగా నేను ఇంత వరకూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొలేదు. చాలా కాలం నేను స్టార్ హీరోయిన్ గా కొసాగాను. ఆ సమయంలో నా తల్లిదండ్రులు నాకు సంబంధించి ఎంతో జాగ్రత్తగా వ్యవరించేవారు.
కానీ ఒకటి మాత్రం బలంగా చెప్పగలను. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే చాలామంది నటీమణులు లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ మళ్లీ రిపీట్ కాకుండా చూడాలి. మహిళల సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వేధింపులు కేవలం మలయాళం లోనే లేవు. అన్ని పరిశ్రమలోనూ ఉన్నాయి. `అని అన్నారు.