కొత్త పద్యం పాడుతున్న వాణీ..ఇలా ఇంకెన్నాళ్లు?
ఎడ్జీ నుండి క్లాసిక్ వరకు... డేరింగ్ స్టైల్ నుండి సింపుల్ లుక్ వరకు రకరకాల స్టైల్‌లను అనుకరించగలనని వాణీ తెలిపింది
By: Tupaki Desk | 13 Sep 2023 4:14 AM GMTనేటితరంలో పర్ఫెక్ట్ ఫ్యాషన్ సెన్స్ తో అలరిస్తున్న స్టైల్ ఐకాన్ గా వాణీకపూర్ పేరు మార్మోగుతోంది. ఈ బ్యూటీ నిరంతర ఫ్యాషన్ ఎంపికలు, ప్రయోగాలు యువతరంలో అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా వాణీ మరో లేటెస్ట్ ఫోటోషూట్ తో విరుచుకుపడింది. చాలా సింపుల్ గా పొడుగు కాళ్ల సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తూ డెనిమ్ షార్ట్ ధరించిన ఈ బ్యూటీ లైట్ స్లీవ్ టాప్ ధరించి టూహాట్ గా కనిపిస్తోంది. అయితే అక్కడ వాణీ తన అందాలను కవర్ చేయడానికి ఒక బ్లేజర్ లాంటి కోట్ ని ధరించింది.
తాజా ఫోటోషూట్ కి వాణీ అద్భుతమైన క్యాప్షన్ ని కూడా ఇచ్చింది. కొండలలో ఒక నివాసం, చాలా సుందరమైన.. నిర్మలమైన దృశ్యంతో...ఒంటరిగా గంటలు దాటి, ఆకాశం దాటి మేఘాలు .. నశ్వరమైన ఆలోచనలతో, మిస్టరీ తో.. అద్భుత ప్రకాశంతో మళ్లీ ప్రేమలో పడటం ఇదే నా ప్రయాణం అని వాణీ కవితాత్మక వర్ణణను రాసింది.
తాజాగా పాపులర్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తన ఫ్యాషన్ ఎంపికలపై వాణి కపూర్ చాలా సంగతులే చెప్పింది. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ఎంపికలు తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని వాణీ తెలిపింది. నాలో ఫ్యాషన్ పెద్ద భాగం. నా సృజనాత్మకత, వ్యక్తిత్వం, శైలిని నేను నా ఫ్యాషన్ సెన్స్ ద్వారానే వ్యక్తపరుస్తాను. నా ఫ్యాషన్ ఎంపికలను ప్రజలు మెచ్చుకున్నప్పుడు అది అద్భుతంగా అనిపిస్తుంది.. అని తెలిపింది.
ఎడ్జీ నుండి క్లాసిక్ వరకు... డేరింగ్ స్టైల్ నుండి సింపుల్ లుక్ వరకు రకరకాల స్టైల్‌లను అనుకరించగలనని వాణీ తెలిపింది. పాశ్చాత్య లేదా భారతీయ దుస్తుల ఎంపిక ఏదైనా, చేసే పనిలో తన హృదయాన్ని ఆత్మను ఉంచుతానని తెలిపింది. వాణి మాట్లాడుతూ- నా ఫ్యాషన్ సెన్స్ కొత్త విషయాల సమ్మేళనంగా ఉండాలని నేను భావిస్తాను. నేను నా స్వంత పద్ధతిలో దుస్తులు ధరించడాన్ని చాలా ఆనందిస్తాను. నాకు ఆత్మవిశ్వాసం కలిగించడంలో సహాయపడుతుంది. పాశ్చాత్య దుస్తులు ధరించినా లేదా భారతీయ దుస్తులలో ఉన్నా నా హృదయాన్ని అందులో ఉంచుతాను. విభిన్న రూపాలతో ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం.. రంగులు ఆకారాలలో ప్రయోగాలు చేస్తాను అని వాణీ తెలిపింది. కపూర్ ఫ్యాషన్ సెన్స్‌ను అభిమానులు తోటి సెలబ్రిటీలు సహా చాలా మంది ప్రశంసించారు. ఆమె అనేక ఫ్యాషన్ మ్యాగజైన్‌లకు ముఖచిత్రంగా ముద్రించబడింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 2013లో రొమాంటిక్ కామెడీ చిత్రం 'శుద్ధ్ దేశీ రొమాన్స్'లో తన సినీ రంగ ప్రవేశం చేసిన వాణీ ఉత్తమ అరంగేట్ర నాయికగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత బేఫిక్రే చిత్రంలో తనదైన నటనతో మెప్పించింది. తెలుగులో ఆహా కళ్యాణం లో నటించినా కానీ సినిమా డిజాస్టరైంది. తెలుగుకు ఈ భామ సూట్ కాలేదని విమర్శల పాలైంది. ఆ తర్వాత యాక్షన్ చిత్రాలైన వార్ - బెల్ బాటమ్ లలో వానీ నటనకు ప్రశంసలు అందుకుంది. రొమాంటిక్ కామెడీ చిత్రం 'చండీగఢ్ కరే ఆషికి'లో లింగమార్పిడి మహిళగా అద్భుత నటనతో మరోసారి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో వాణీ పోషించిన పాత్ర అన్ని వర్గాల దృష్టిని ఆకర్షించింది. అలాగే లింగమార్పిడి అమ్మాయి పాత్రను పోషించిన ఏకైక ప్రముఖ బాలీవుడ్ నటిగా రికార్డులకెక్కింది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు ఇండస్ట్రీ వర్గాల నుంచి బోనస్ ప్రశంసలు కురిసాయి. 'చండీగఢ్ కరే ఆషికి' , షంషేరాలోను అద్భుతంగా నటించింది. వార్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న వాణీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. దినేష్ విజన్ ప్రాజెక్ట్ ... అషిమ్ అహ్లువాలియాతో అలాగే మరొకటి నిఖిల్ అద్వానీ ప్రొడక్షన్స్ తో సినిమాలు చేస్తోంది. ఇటీవల పలువురు దర్శకులు వినిపించిన కథలు విన్న వాణీ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందిట.