Begin typing your search above and press return to search.

వాణీ లో ఆ వేడి ఉష్ట్రోగ్ర‌త ఎంతంటే?

ఎప్ప‌టిక‌ప్పుడు వాణీలో వేడిని ఆవిష్క‌రిస్తూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని అంత‌కంత‌కు రెట్టింపు చేసుకుంటుంది

By:  Tupaki Desk   |   12 Feb 2024 12:13 PM GMT
వాణీ లో ఆ వేడి ఉష్ట్రోగ్ర‌త ఎంతంటే?
X

బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ ఇన్ స్టాని హీటెక్కించడంలో తనదైన మార్క్ వేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సొగ‌సైన‌ ఫోటోలతో మంటలు రేప‌డం సొగ‌స‌రి ప్ర‌త్యేక‌త‌. ఆల్ట్రా మోడ్ర‌న్ దుస్తుల్లోనూ అగ్గిరాజేస్తుంది. మార్కెట్ లో న్యూ ట్రెండ్స్ ని ప‌రిచ‌యం చేయ‌డంలోనూ ముందుంటుంది. సినిమాల క‌న్నా అధిక ఆదాయాన్ని ఇన్ స్టా ద్వారానే సంపాదిస్తుంది. భామ‌లంద‌ర‌కి కంటే వాణీ క‌పూర్ ఆ లిస్ట్ లో ముందు వ‌రుస‌లో ఉందంటే? అతిశ‌యోక్తి కాదు.


ఎప్ప‌టిక‌ప్పుడు వాణీలో వేడిని ఆవిష్క‌రిస్తూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని అంత‌కంత‌కు రెట్టింపు చేసుకుంటుంది. దీంతో ఆదాయం అంతే పెరుగుతుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చే సింది. ఇదిగో ఇక్క‌డిలా వాణీలో వేడి మొత్తం మ‌రోసారి ఆవిష్క‌రించింది. టాప్ దుస్తుల్లో అమ్మ‌డు సెగ‌లు పుట్టించేసింది. ప‌సుపు..నీలం బికినీ పీస్ లో సొగ‌స‌రి వేడిని త‌ట్టుకోవ‌డం అసాధ్య‌మే.


అలాగే మ్యాచింగ్ స్కైబ్లూ లో మెరిసే ప్యాంట్ ధ‌రించి ముంద‌ర బ‌ట‌న్ ఓపెన్ చేసేసింది. ఇది గుడుంబా శంక‌ర స్టైల్ అంటూ మ‌రోసారి పీకే స్టైల్ ని గుర్తు చేసింది. అమ్మ‌డు స్టైలిష్ భంగిమ‌లో కెమెరాకి ఫోజులి చ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. దీంతో వాణీ అభిమానులు అంతే ఫిదా అవుతున్నారు. వాణిలో వేడిని ఉద్దేశించి హాట్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇక వాణీ క‌పూర్ `శంషేరా` ప్లాప్ త‌ర్వాత కొత్త క‌మింట్ మెంట్లు షురూ చేయ‌డానికి ఏడాదికి పైగానే స‌మ‌యం తీసుకుంది. గ‌తేడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌లేక‌పోయింది. అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించ‌డానికి స‌మయం సరిపోయింది. ఎలాగూ ఓ రెండు ఛాన్సులు ఒడిసిప‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఆ రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. వాణీ ఆశ‌ల‌న్నీ కూడా ఆ సినిమాల‌పైనే పెట్టుకుంది. ఈ అమ్మ‌డు ఆహా క‌ళ్యాణంతో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.