ఆ ఇద్దరు హీరోల్లో ఎవరిని పెళ్లాడతావ్ బేబీ?
ఆనంద్ దేవరకొండ- విరాజ్ హీరోలుగా, వైష్ణవి ప్రధాన పాత్రలో నటించిన 'బేబి' చిత్రం థియేట్రికల్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 30 Aug 2023 4:39 AM GMTఆనంద్ దేవరకొండ- విరాజ్ హీరోలుగా, వైష్ణవి ప్రధాన పాత్రలో నటించిన 'బేబి' చిత్రం థియేట్రికల్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 90 కోట్లు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఆహా-ఓటీటీలోను గొప్ప ఆదరణ దక్కించుకుంటోంది. ఇదే సందర్భంగా ప్రమోషనల్ వీడియోలో బేబీ వైష్ణవి చెప్పిన సంగతులు ఆసక్తిని కలిగించాయి.
ఒకవేళ ఆనంద్ లేదా విరాజ్ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లాడాల్సి వస్తే ఎవరిని చేసుకుంటారు? అని ప్రశ్నించగా.. ''ఇద్దరినీ కాదు'' అంటూ సూటిగా సమాధానం ఇచ్చేసింది. బేబి పాత్ర ప్రవర్తన సరైనదేనా? అని ప్రశ్నించగా.. సమయం సందర్భాన్ని బట్టి ఆ పాత్ర అలా ప్రవర్తించడం కరెక్టేనని నవ్వేసింది. పాత్ర లక్షణాలకు తగ్గట్టు ప్రవర్తించడమే నటీమణుల పని అని కూడా అంది.
వైష్ణవి పాత్ర అంత బాగా నచ్చిందా? అని ప్రశ్నించగా నచ్చింది అంటూ నవ్వులు చిందించింది. బేబి అద్భుత నటనకు స్క్రీన్ ప్రెజెన్స్ కు ఫిదా అయిపోయిన మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ వేదికపై వైష్ణవిని ఎంతో పొగిడేశారు. సహజనటి జయసుధ తర్వాత మళ్లీ అంత మంచి సహజనటి అంటూ కితాబిచ్చేశారు. యూట్యూబ్ వీడియోలతో పాపులరైన వైష్ణవి ఇప్పుడు స్టార్ గా వెలిగిపోతోంది. వైష్ణవి వరుస చిత్రాలకు కమిటవుతోంది. తదుపరి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం వాట్సాప్ బేబి వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.