Begin typing your search above and press return to search.

'బేబీ' చేతిలో రెండు బొమ్మలు..!

యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య హీరోగా నటించిన బేబీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   6 Sep 2023 5:34 AM GMT
బేబీ చేతిలో రెండు బొమ్మలు..!
X

యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య హీరోగా నటించిన బేబీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నటిగా ఆమె తన విశ్వరూపం చూపించడంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్‌ గా ఆఫర్లు రావడం కష్టం అనుకుంటున్న సమయంలో బేబీ సినిమా కారణంగా ఒకే సారి రెండు సినిమాల్లో నటించే అవకాశంను ఈ అమ్మడు దక్కించుకుంది.

తెలుగు అమ్మాయిలు చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ అమ్మడికి మాత్రం క్రేజ్ ఉన్న హీరోల సినిమాల్లో.. మంచి బజ్ ఉన్న సినిమాల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి. ఒకేసారి రెండు సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్న ఈమె ముందు ముందు మరిన్ని క్రేజీ సినిమాల్లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.

డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్‌ గా వైష్ణవి చైతన్య ను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ తో సినిమా అంటే కచ్చితంగా బేబీ కి మంచి ఛాన్స్ అనడంలో సందేహం లేదు.

ఇక దిల్ రాజు ఫ్యామిలీకి చెందిన ఆశిష్‌ హీరోగా రూపొందబోతున్న ఒక సినిమా లో కూడా వైష్ణవిని హీరోయిన్‌ గా ఎంపిక చేయడం జరిగింది. దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను ఆయన కుటుంబంకు చెందిన వారే నిర్మిస్తున్నారు. మొత్తానికి వైష్ణవి బేబీ సినిమా కారణంగా రెండు సినిమాలు దక్కించుకుంది. అవి కూడా హిట్‌ అయితే ఆమె వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి.