ఈ భామలు భార్యమణులైతే తెరంతా అందమే!
పాత్రల పరంగా హీరోయిన్లకు ఇప్పుడు ఎలాంటి హద్దులు లేవిప్పుడు . ఒకప్పుడు భార్య పాత్రలు..బిడ్డకి తల్లి పాత్రలనేసరికి వెనకడుగు వేసారు
By: Tupaki Desk | 30 Nov 2023 2:45 AM GMTపాత్రల పరంగా హీరోయిన్లకు ఇప్పుడు ఎలాంటి హద్దులు లేవిప్పుడు . ఒకప్పుడు భార్య పాత్రలు..బిడ్డకి తల్లి పాత్రలనేసరికి వెనకడుగు వేసారు. కానీ ఇప్పుడా పాత్రల్లోనే పోటీ పడి మరీ నటిస్తున్నారు. స్టార్ హీరో చిత్రంలో ఛాన్స్ అంటే చాలు భార్యామణులుగా ఒదిగిపోతున్నారు. ఇంతకు ముందులా ఇప్పుడు భార్య పాత్రల్లో నటించే ఛాన్స్ వచ్చిన వాళ్లు లక్కీ భామలనే అనాలి. ఎందుకంటే? భార్య పాత్రలు బాగా తగ్గిపో యాయి. స్టోరీలు లవర్ పాత్రల్ని డిమాండ్ చేసినంతగా భార్య పాత్రలు డిమాండ్ చేయలేదు.
దీంతో భార్య పాత్రలకు తక్కువ స్కోప్ కనిపిస్తుంది. ఇప్పుడో స్టార్ హీరో సినిమాలో భార్య రోల్ అంటే? లక్కీగా భావించా ల్సిందే. తద్వారా రెండు రకాలుగా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరు కుతుంది. ఒకటి నటనకు ఎక్కువ స్కోప్ కుదురుతుంది...సినిమాలో ఆ పాత్ర బలంగా పండుతుంది. ఆ తరహా పాత్రలు పోషించడం ఒక్కోసారి నేటి తరం నటీమణులకు సవాల్ గానూ మారుతుంది.
ఇప్పటికే సీనియర్ నాయికలు అనుష్క..నయనతార..త్రిష..సమంత..శ్రుతి హాసన్..తమన్నా లాంటి వారు ఆ తరహా పాత్రల్లో ఎక్స్ పర్స్ట్ గా మారారు. ఆ తర్వాతి తరంలో రష్మిక మందన్న...మృణాల్ ఠాకూర్ లాంటి భామలు ఎక్కువగా కనిపిస్తున్నారు. 'గీతగోవిందం' క్లైమాక్స్ లో రష్మిక భార్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'పుష్ప'లో బన్నీ భార్య పాత్రతో మొదటి భాగాన్ని ముగించారు. రెండవ భాగంలో శ్రీవల్లి-పుష్పరాజ్ ని భార్యా భర్తలుగా కనిపిస్తారు.
తాజాగా 'యానిమల్' లో కూడా రష్మిక భార్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఆ తరహా పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రణబీర్ భార్య పాత్రలో అమ్మడు ఒదిగిపోయినట్లే కనిపి స్తుంది. అలాగే 'సీతారామం'లో మృణాల్ ఠాకూర్ ని ఎంత గొప్పగా అభినయించిందో తెలిసిందే. అందులో పెర్మార్మెన్స్ మెచ్చే గౌతమ్ తిన్ననూరి 'హాయ్ నాన్న'లో నానికి భార్య రోల్ బాధ్యతలు అప్పగించాడు. ఇప్పటికే ఆ రెండు పాత్రల ప్రచార చిత్రాలు నెటి జనుల్ని ఆకట్టుకుంటున్నాయి.