Begin typing your search above and press return to search.

ఇంట‌ర్మీడియ‌ట్ తోనే అమ్మ‌డు 13 కోట్లు ఆస్తి!

ముంబై బ్యూటీ ఆదాశ‌ర్మ సుప‌రిచిత‌మే. `హార్ట్ ఎటాక్` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మ‌డు అటుపై కొన్ని సినిమాలు చేసింది

By:  Tupaki Desk   |   21 Aug 2024 5:30 PM GMT
ఇంట‌ర్మీడియ‌ట్ తోనే అమ్మ‌డు 13 కోట్లు ఆస్తి!
X

ముంబై బ్యూటీ ఆదాశ‌ర్మ సుప‌రిచిత‌మే. `హార్ట్ ఎటాక్` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మ‌డు అటుపై కొన్ని సినిమాలు చేసింది. కానీ తెలుగులో నిల‌దొక్కుకోలేక‌పోయింది. దీంతో బాలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ అంటూ అన్ని భాష‌ల్ని చుట్టేసింది. `ది కేర‌ళ స్టోరీ`తో అమ్మ‌డికి మంచి గుర్తింపు ద‌క్కింది. అప్ప‌టి నుంచి న‌టిగా బిజీ అయింది. ప్ర‌స్తుతం అవ‌కాశం వ‌చ్చిన అన్ని భాష‌ల్లోనూ కొన‌సాగుతోంది.

కానీ ఇంత వ‌ర‌కూ చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే? ఆదాశ‌ర్మ పెద్ద‌గా చ‌దువుకోలేదు. కేవ‌లం ఇంట‌ర్మీడియ‌ట్ మాత్ర‌మే చ‌దువుకుంది. చ‌దువుపై ఆస‌క్తి లేక‌పోవ‌డంతోనే అమ్మ‌డు అటువైపు వెళ్ల‌లేదు. చుదువు పూర్తి చేసిన త‌ర్వాత సినిమాల్లోకి వెళ్ల‌మ‌ని తల్లిదండ్రులు చెప్పినా? అమ్మ‌డు వాళ్ల మాట‌ను పెడ చెవిన పెట్టి ఇండ‌స్ట్రీకి వ‌చ్చేసిందిట‌. అలా న‌టి కావడంతోనే అమ్మ‌డు ఇప్ప‌టివ‌ర‌కూ 13 కోట్ల రూపాయ‌ల ఆస్తిని కూడడెట్టిందిట‌.

అంతా తాను సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత సంపాదించిన మొత్తం అంట‌. సినిమాల ద్వారా వ‌చ్చిన ఆదాయం, ప్ర‌క‌ట‌న‌లు, సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్లు ఇలా 14 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో సంపాదించిన సంపాద‌న అది. తాను ఉద్యోగం చేసినా ఇంత‌వ‌ర‌కూ అన్ని కోట్లు సంపాదించేది కాద‌ని తెలుస్తోంది. అస‌లు ఇంట‌ర్మీడియ‌ట్ తో ఉద్యోగం రావ‌డమే క‌ష్టం. సంపాద‌న మాట దేవుడెరుగు. కొన్ని నెలల క్రితం, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటికి మారిన సంగ‌తి తెలిసిందే.

ఇంట‌ర్ తర్వాత నటనతో పాటు డ్యాన్స్ పాఠాలకు సంబంధింకి క్లాస్ లు తీసుకుంది. కథక్ నృత్యంలో శిక్షణ పొందింది. విక్రమ్ భట్ '1920'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన మొదటి సినిమాలోనే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ త‌ర్వాత మ‌రో రెండు హిందీ సినిమాలు చేసి టాలీవుడ్ కి వచ్చింది.