Begin typing your search above and press return to search.

ప‌విట కొంగు స‌వ‌రించి.. ఫోన్‌లో త‌ల దూర్చి..

అదా శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభ‌మే పూరి జ‌గ‌న్నాథ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సినిమాలో అవ‌కాశం అందుకుంది.

By:  Tupaki Desk   |   23 July 2024 3:26 AM GMT
ప‌విట కొంగు స‌వ‌రించి.. ఫోన్‌లో త‌ల దూర్చి..
X

అదా శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభ‌మే పూరి జ‌గ‌న్నాథ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సినిమాలో అవ‌కాశం అందుకుంది. హార్ట్ ఎటాక్ లో నితిన్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఆడిపాడింది. కానీ ఇది ఈ భామ‌కు ఆశించిన మైలేజ్ ని ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత బ‌న్ని సినిమాలో అతిథి త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించింది. చివ‌రిగా రాజ‌శేఖ‌ర్ `క‌ల్కి` చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత బాలీవుడ్ లో `ప‌తి పత్ని ఔర్ పంగ` అనే చిత్రంలో న‌టించింది. `క్వ‌శ్చ‌న్ మార్క్‌` అనే చిత్రంలో న‌టిస్తోంద‌ని ప్ర‌చార‌మైనా దానిపై స్ప‌ష్ఠ‌త లేదు. సోల్ స‌తి అనే చిత్రంలోనూ అదా న‌టించింది. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఈ మూవీ చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. ఆ త‌ర్వాత అదా శ‌ర్మ గురించిన స‌రైన అప్ డేట్ లేదు.


అయితే సినిమాల‌తో సంబంధం లేకుండా సోష‌ల్ మీడియాలో వ‌రుస ఫొటోషూట్ల‌తో అదాశ‌ర్మ ట్రీటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫోటోలు వీడియోల‌తోనే ఇన్ స్టా.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ భామ‌కు అసాధార‌ణ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా అదా స‌రికొత్త గెట‌ప్ తో అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. ఎంతో సాంప్ర‌దాయ బ‌ద్ధంగా చీరను ధ‌రించిన అదా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మ‌తులు చెడ‌గొడుతోంది. అదా ఈ చీర‌లో ఎంతో హా* గా క‌నిపిస్తోంది అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ఆద‌మ‌రిచి ప‌విట కొంగు జార‌విడుస్తుందేమో! అంటూ సందేహం వ్య‌క్తం చేసారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


అదా శ‌ర్మ ఇటీవ‌లే ఎవ‌రూ సాహ‌సించ‌ని హాంటెడ్ హౌస్ లో త‌న కుటుంబంతో అడుగుపెట్టింద‌ని ప్ర‌చార‌మైంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణించాక ఎవ‌రూ ఆ ఇంట్లో అద్దెకు కానీ, కొనుగోళ్ల‌కు కానీ రాలేదు. కానీ ఇప్పుడు ఆ ఇంటిని అదాశ‌ర్మ కొనుక్కోవ‌డ‌మే గాక‌, అందులో లాంచింగ్ కూడా చేసింది. కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. అదాశ‌ర్మ న‌టించిన త‌దుప‌రి సినిమాల వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.