సుశాంత్ సింగ్ అపార్ట్‌మెంట్ కొనుక్కున్న నటి?
అవును.. సదరు నటీమణి దెయ్యం నివశించే బంగ్లా కొనుక్కుందని చాలా కాలంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి
By: Tupaki Desk | 6 April 2024 12:28 PM GMTఅవును.. సదరు నటీమణి దెయ్యం నివశించే బంగ్లా కొనుక్కుందని చాలా కాలంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఆ ఇంట్లో ప్రముఖ హీరో నివశించేవాడు. అందులోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత ఆ ఇంటికి అద్దెకు దిగేందుకు కానీ, లేదా కొనుగోలు చేసేందుకు కానీ ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ కొంత కాలంగా ఆ ఇంటిని ఒక హీరోయిన్ కొనుగోలు చేసిందంటూ ప్రచారం సాగుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో హీరోయిన్ ఎవరు? అంటే అదాశర్మ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడిన ఇంటిని కొనుగోలు చేసిందంటూ ప్రచారం సాగుతోంది.
తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రా అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలపై అదా శర్మ మౌనం వీడారు. దీనిపై మాట్లాడడానికి సరైన సమయం ఉంది అని అదా శర్మ అన్నారు. సిద్ధార్థ్ కన్నన్‌తో ఇటీవలి ఇంటర్వ్యూలో అదా గతంలో ఆ అపార్ట్‌మెంట్ సమీపంలో కనిపించిన తర్వాత ఆ ఇంటిని కొనుగోలు చేసిందని కథనాలు రావడంపై చాలా ఎంక్వయిరీలు జరిగాయి. సుశాంత్ 14 జూన్ 2020న విషాదకరంగా మరణించాడు. సముద్రానికి ఎదురుగా ఉన్న నివాసంలో సుశాంత్ ఉండేవాడు. ఆ ఇంటిని అదా శర్మ కొనుక్కుందని, ఆమె యాజమాన్యం గురించి వస్తున్న ఊహాగానాల గురించి ప్రశ్నించినప్పుడు ``ప్రస్తుతానికి నేను అందరి హృదయాల్లో నివసిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాను. మాట్లాడేందుకు సరైన సమయం ఉంది. ఆ ప్రదేశాన్ని చూసేందుకు వెళ్లిన తర్వాత మీడియా దృష్టికి కాస్త ఊరట కలిగింది. నేను ప్రైవేట్ వ్యక్తిని. నా సినిమాల కోసం ప్రజల దృష్టిలో ఉండటం నాకు చాలా ఇష్టం. కానీ నేను ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉంటాను. నేను నా గోప్యతను కాపాడుకుంటాను`` అని అన్నారు.
సుశాంత్ గురించి మాట్లాడేందుకు, ఇతర ప్రతికూల విషయాల గురించి చర్చలలో పాల్గొనడంలో తన అయిష్టతను ఓపెన్ గా వ్యక్తం చేసింది. ఈ లోకంలో లేని, ఇంత అందమైన సినిమాలు చేసిన వారి గురించి మాట్లాడటం తప్పే అని నేనూ అనుకున్నాను.. ఆ తప్పు నేను చేయలేను. అతడు నా దృష్టిలో ఎంతో గౌరవం ఉన్న నటుడు కాబట్టి ... తనకు గౌరవం ఉన్న ప్రతిదాన్ని దాచి ఉంచడం ఇష్టం... వ్యక్తులు లూజ్ టంగ్ చూపించడం నాకు నచ్చదు... నాకు నచ్చలేదు.. అని అదా శర్మ పేర్కొంది.
సుశాంత్ ఒకప్పుడు నివాసం ఉండే మాంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్ ను యజమాని అద్దెకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా ఎవరూ ముందుకు రాలేదని, అనంతరం అమ్మకానికి పెట్టాడని కథనాలొచ్చాయి. జనం సెంటిమెంటుగా కూడా ఆ బంగ్లాను కొనుగోలు చేయడంపై ఆసక్తిని కనబరచలేదు. కానీ అదా శర్మ ధైర్యం చేసి ఈ భవంతిని కొనుక్కుందని కథనాలొచ్చాయి.