Begin typing your search above and press return to search.

యాడ్ ఛాన్స్.. నటిని నైట్‌ కి కాంప్రమైజ్‌ అడిగాడట

అగ్రిమెంట్‌ సైట్ చేయడానికి ఒక రాత్రి రావాల్సి ఉంటుంది... ఆ రాత్రి అక్కడ ఉన్న వారితో చిల్‌ అవ్వాలంటూ మెసేజ్ చేశాడు.

By:  Tupaki Desk   |   15 Oct 2023 2:45 AM GMT
యాడ్ ఛాన్స్.. నటిని నైట్‌ కి కాంప్రమైజ్‌ అడిగాడట
X

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కొత్త హీరోయిన్స్ తో పాటు సీనియర్ హీరోయిన్స్ ఎంతో మంది ఇప్పటి వరకు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం జరిగింది. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా పరిధి విస్తరించడంతో పాటు, మీటూ అనే ఉద్యమం కారణంగా కాస్టింగ్ కౌచ్ అనేది కాస్త తగ్గింది.

కాస్టింగ్‌ కౌచ్ అనేది పూర్తిగా పోలేదు అని తాజాగా నటి మృణాల్‌ నవేల్‌ వ్యాఖ్యలతో వెళ్లడయింది. ఏడాది క్రితం ఒక యాడ్‌ లో నటించే అవకాశం వచ్చిందని, అయితే ఆ యాడ్‌ లో నటించేందుకు కాస్టింగ్‌ డైరెక్టర్ కాంప్రమైజ్ అవ్వాలని అన్నాడు. యాడ్‌ అగ్రిమెంట్‌ సైన్ చేసేందుకు రాత్రి సమయంలో రావాలంటూ కూడా అతడు అన్నాడని మీడియా ముందు చెప్పుకొచ్చింది.

నటి మృణాల్‌ నవేల్‌ మాట్లాడుతూ... గత సంవత్సరం ఒక యాడ్‌ లో నటించేందుకు గాను ఆడిషన్స్ కి వెళ్లాను. కొన్ని రోజుల తర్వాత కాస్టింగ్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి యాడ్ కోసం షార్ట్‌ లిస్ట్‌ లో మీ పేరు ఉంది. సెలక్ట్‌ అయితే హీరో కార్తీక్ ఆర్యన్‌ తో కలిసి యాడ్‌ లో నటించే అవకాశం మీకు లభిస్తుందని అన్నారు. తర్వాత రోజు అతడి నుంచి మెసేజ్ వచ్చింది.

ఆ యాడ్‌ లో అవకాశం దక్కాలి అంటే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందని అన్నాడు. అతడి మాటలు నాకు అర్థం అయ్యాయి. అయితే అర్థం కానట్లుగా నేను కాంప్రమైజ్ అంటే ఏం చేయాలి అన్నట్లుగా అడిగాను. అగ్రిమెంట్‌ సైట్ చేయడానికి ఒక రాత్రి రావాల్సి ఉంటుంది... ఆ రాత్రి అక్కడ ఉన్న వారితో చిల్‌ అవ్వాలంటూ మెసేజ్ చేశాడు.

దాంతో నేను ఒక్కసారిగా అతడిపై కోపంతో తిట్టాను. నా గురించి ఏమనుకుంటున్నావు అంటూ తిట్టేశాను. దాంతో అతడు అన్ని మెసేజ్‌ లను డిలీట్ చేసుకున్నాడు. అవకాశాల కోసం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు అంటూ అతడిని గట్టిగా తిట్టేశాను అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పలు యాడ్స్ లో నటిస్తూ మృణాల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే.