Begin typing your search above and press return to search.

సినిమా పిచ్చి తో ఇలా కూడా జ‌ర‌గొచ్చు!

సినిమా లైఫ్ అంటే గ్యారెంటీ లేని లైఫ్‌. స‌క్సెస్ అయితే జీవితం ఒక‌లా ఉంటుంది? స‌క్సెస్ పోతే అంత‌కుమించి అంతే ద‌య‌నీయంగానూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   14 May 2024 10:30 AM GMT
సినిమా పిచ్చి తో ఇలా కూడా జ‌ర‌గొచ్చు!
X

సినిమా లైఫ్ అంటే గ్యారెంటీ లేని లైఫ్‌. స‌క్సెస్ అయితే జీవితం ఒక‌లా ఉంటుంది? స‌క్సెస్ పోతే అంత‌కుమించి అంతే ద‌య‌నీయంగానూ ఉంటుంది. ఇండ‌స్ట్రీ కి స‌క్సెస్ కోసం వ‌చ్చిన విజ‌యం సాధించిన వారికంటేఫెయిలైన వారే ఎక్కువ ఉంటారు. ఇక్క‌డ ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా క‌లిసి రావాలి. ఇంకా చెప్పాలంటే? ట్యాలెంట్ కంటే ల‌క్ అనేది కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఎలాంటి ఫ్యాష‌న్ లేకుండా ల‌క్కీగా అవ‌కాశాలొచ్చి స‌క్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు.

ట్యాలెంట్ ఉండి ఫెయిలైన వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా యాంకర్ క‌మ్ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ అదిరే అభి ఇండ‌స్ట్రీ గురించి త‌న అనుభ‌వాన్ని పంచుకునే ప్ర‌య‌త్నం చేసాడు. `తొలి నుంచి నాకు నటన అంటే ఇష్టం. అందువలన నేను సినిమాల వైపు వచ్చాను. పల్లెటూర్లో ఉంటూ సినిమాలను గురించి మనం అనుకునేది వేరు .. ఇక్కడికి వచ్చిన తరువాత మనకి కనిపించేది వేరు. సినిమాలలో అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో నేను జాబ్ వైపు వెళ్లిపోయాను.

10 ఏళ్ల పాటు నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ టీవీ షోస్ చేస్తూ కెరియర్ ను కొనసాగించాను. ఆఫీస్ లో మా బాస్ సహక రించడం వల్లనే ఇది సాధ్యమైంది. నాకు ఇద్దరు పిల్లలు .. ప్రస్తుతానికి చదువుపైనే దృష్టిపెట్టమని చెప్పాను. యాక్టింగ్ అంటే ఇష్టమా లేదా అనేది కూడా నేను అడగలేదు. యాక్టింగ్ అంటే ఇష్టమని నాతో ఎవరు చెప్పినా, ముందుగా చదువు పూర్తిచేయమని చెబుతాను. ముందుగా చదువుకోవాలి .. ఆ తరువాత ఆర్ధిక పరమైన భద్రత కోసం డబ్బు సంపాదించుకోవాలి.

ఆ తరువాత నటన వైపు రావొచ్చు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయ్యేవారు చాలా తక్కువమంది. సక్సెస్ కాలేకపోతే బయటికి వెళ్లి ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలా అయోమయంలో పడిపోయినవారిని నేను చాలామందిని చూశాను. ఒక‌సారి మ్యాక‌ప్ కి అల‌వాటు పడిన త‌ర్వాత రోజు మ్యాక‌ప్ వేయాల‌నిపిస్తుంది. అది ఒక్క‌సారిగా దూర‌మ‌వుతుందంటే త‌ట్టుకోవ‌డం క‌ష్టం. కానీ ఇక్క‌డ అన్నిర‌కాల ప‌రిస్థితుల‌కు త‌ట్టుకోగ‌ల‌గాలి` అని అన్నాడు.