Begin typing your search above and press return to search.

ఆది కేశవ.. బాక్సాఫీస్ టార్గెట్ అందుకోగలదా?

మెగా హీరో వైష్ణవ తేజ్, క్రేజీ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆదికేశవ.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:08 AM GMT
ఆది కేశవ.. బాక్సాఫీస్ టార్గెట్ అందుకోగలదా?
X

మెగా హీరో వైష్ణవ తేజ్, క్రేజీ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ ఈ సినిమాని నిర్మించారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ మూవీతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. చాలా వాయిదాల తర్వాత తాజాగా ఈ సినిమా ధియేటర్స్ లోకి వచ్చింది.

అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. వైష్ణవ తేజ్ తనని తాను కమర్షియల్ హీరోగా ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఆది కేశవ మూవీ చేసినట్లు కనిపిస్తోంది. కమర్షియల్ మూవీకి కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. అయితే కథ, కథనం రొటీన్ గా ఉండడంతో డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8.85 కోట్ల బిజినెస్ చేసింది. వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో పోల్చుకుంటే ఇది పెద్ద బిజినెస్ అయితే ఏమీ కాదు. నైజాం ఏరియాలో 2.80 కోట్లకు ఆది కేశవ రైట్స్ అమ్ముడయ్యాయి. సీడెడ్ 1.40 కోట్ల బిజినెస్ జరిగింది.

మొత్తం ఏపీ తెలంగాణలో 7.85 కోట్ల బిజినెస్ జరగగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్ లో 50 లక్షల వ్యాపారం జరిగింది. అయితే ఈ సినిమాపై వైష్ణవ తేజ్ మార్కెట్ పరిధికి మించి ఖర్చు పెట్టారని తెలుస్తుంది. కానీ బిజినెస్ మాత్రం మొత్తం 10 కోట్లు కూడా దాటలేదు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 9.2 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.

అయితే సినిమాకి ప్రస్తుతం డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఏ మేరకు ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరో వైపు మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి ఉప్పెన తర్వాత ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా లేదు. కొండపొలం, రంగరంగవైభవంగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఆదికేశవ మూవీ కూడా చేరేలా కనిపిస్తోంది.