Begin typing your search above and press return to search.

ఆది కేశవ.. ఇది బాక్సాఫీస్ పరిస్థితి

వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో కమర్షియల్ హీరోగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశాడు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 3:58 AM GMT
ఆది కేశవ.. ఇది బాక్సాఫీస్ పరిస్థితి
X

వైష్ణవ్ తేజ్, శ్రీలీల కాంబినేషన్ లో శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో కమర్షియల్ హీరోగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశాడు.

అయితే కథ, కథనం రొటీన్ గా ఉండటంతో ఆదికేశవ ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేకపోయింది. శ్రీలీల ఖాతాలో స్కంద తర్వాత మరో డిజాస్టర్ గా ఈ మూవీ చేరింది. వైష్ణవ్ తేజ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే చాలా థియేటర్స్ నుంచి ఆదికేశవ సినిమాని తీసేశారు. యానిమల్ రిలీజ్ అయితే ఉన్న థియేటర్స్ లలో కూడా తొలగించే అవకాశం కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా 8.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 9.2 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. అయితే 5 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 2.29 కోట్లు షేర్ మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 6.91 కోట్లు షేర్ అందుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బ్రేక్ ఈవెన్ అందుకునే ఛాన్స్ అస్సలు లేదని చెప్పాలి.

ఈ రోజు ఎలక్షన్ పోలింగ్ ఉంటుంది కాబట్టి థియేటర్స్ కి ఆడియన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కనీసం రెంట్ ఖర్చులు కూడా రావు. ఇక డిసెంబర్ 1న యానిమల్ మూవీ భారీ ఎత్తున దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాపై హైప్ ఉండటంతో ప్రేక్షకులు యానిమల్ చూడటానికి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో బయ్యర్లు ఆదికేశవని తొలగించే అవకాశం కనిపిస్తోంది.

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత వైష్ణవ్ తేజ్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేయగా మూడు ఫ్లాప్ కావడం విశేషం. మంచి కథలు ఎంపిక చేసుకొని టైం తీసుకొని మూవీ చేస్తే మళ్ళీ సక్సెస్ బాట పట్టే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.