Begin typing your search above and press return to search.

ఆదిపురుష్.. అలాంటి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకే..!

ఆదిపురుష్ స్ట్రీమింగ్ అవుతోంద‌ని ట్వీట్ చేసిన దర్శకుడు ఓం రౌత్ దాని కింద కామెంట్స్ సెక్షన్ ని డిజేబుల్ చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:30 AM GMT
ఆదిపురుష్.. అలాంటి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకే..!
X

పురాణేతిహాసం రామాయ‌ణం ఆధారంగా రూపొందించిన 'ఆదిపురుష్' వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసిందే. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నుంచి చాలా ఆశించిన ప్ర‌భాస్ అభిమానులు థియేట‌ర్ల‌లో వీక్షించాక‌ నిరాశ చెందారు. డార్లింగ్ ఎన‌ర్జీని ఓంరౌత్ వృధా చేశాడ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీనికి తోడు ఈ సినిమాలో డైలాగులు .. వీఎఫ్ఎక్స్ వంటివి విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. సైఫ్ పాత్ర చిత్ర‌ణ స‌హా భ‌జ‌రంగ్ పాత్ర‌ధారి డైలాగులు తీవ్ర‌మైన వివాదాల‌కు కార‌ణ‌మ‌య్యాయి.

ఇప్ప‌టికీ ఈ సినిమాపై కోర్టు కేసులు న‌డుస్తున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో తదుప‌రి కోర్టు తీర్పులో 'స్టే' విధించేందుకు ఆస్కారం ఉంద‌న్న గుస‌గుస‌ల న‌డుమ ఆదిపురుష్ సినిమాని సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వాస్త‌వానికి ఏదైనా సినిమా ఓటీటీలో విడుద‌ల‌వుతోంది అంటే దానికి ఇటీవ‌ల విస్త్ర‌తంగా ప్ర‌చారం చేస్తున్నారు. అందుకు విరుద్ధంగా ఎలాంటి ప్ర‌చార‌ హంగామా లేకుండా ఆదిపురుష్ సైలెంటుగా ఓటీటీలోకి విడుద‌లైంది. హిందీ వెర్ష‌న్ ని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తుండ‌గా ఇత‌ర అన్ని వెర్ష‌న్ల‌ను అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల చేసారు.

ఇక ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ఎప్ప‌టిలానే విమ‌ర్శ‌ల‌కు భ‌య‌ప‌డి సోష‌ల్ మీడియాల్లో జిమ్మిక్ చేయ‌డం నెటిజ‌నుల్లో డిబేట్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ లో ఆదిపురుష్ స్ట్రీమింగ్ అవుతోంద‌ని ట్వీట్ చేసిన దర్శకుడు ఓం రౌత్ దాని కింద కామెంట్స్ సెక్షన్ ని డిజేబుల్ చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.స్నేహితులు, ఎంపిక చేసిన అనుచ‌రుల‌కు త‌ప్ప కామెంట్ చేసే అవ‌కాశం ఇత‌రుల‌కు లేదు. ఓంరౌత్ అలా చేయ‌డానికి కార‌ణం ఏమై ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

నిజానికి ఆదిపురుష్ చిత్రం 450కోట్లు వ‌సూలు చేసింద‌ని ప్ర‌చారం చేస్తున్నా.. బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అంటూ ధీమాగా ఉన్నా కానీ నెటిజ‌నుల ట్రోలింగ్ తోనే ఓంరౌత్ కి చిక్కులు వచ్చి ప‌డ్డాయి. డిజేబుల్ చేయ‌డం ద్వారా చెక్ పెట్టినా కానీ.. రామానంద్ సాగ‌ర్ 'రామాయ‌ణం'(బుల్లితెర సీరియ‌ల్) అభిమానులు మాత్రం ఓంరౌత్ ని తిట్టుకోకుండా ఉండ‌రన్న‌ది వాస్తవం. ఏది ఏమైనా కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియా డిబేట్ కూడా ఓటీటీలో ఆదిపురుష్ ప్ర‌చారానికి క‌లిసి వ‌చ్చేదే.