ఇంటికి రౌడీలొచ్చి బెదిరించారు..అయినా బెదర్లే!
యువ నటుడు అదిత్ అరుణ్ సుపరిచితుడే. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి నిరూపిచుకునే పనిలో ఉన్నాడు
By: Tupaki Desk | 14 March 2024 4:15 AM GMTయువ నటుడు అదిత్ అరుణ్ సుపరిచితుడే. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి నిరూపిచుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హీరోగా..నటుడిగా కొన్ని సినిమాలు చేసాడు. 'కథ'..'వీకెండ్ లవ్'.. 'తుంగభద్ర'.. 'తాగితే తందానా'..' కథ కంచికి మనం ఇంటికి'..'కొండా' లాంటి చిత్రాల్లో నటించాడు. ఇంకా కొన్ని భారీ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. అయితే హీరోగా మాత్రం ఇంకా నిలదొక్కు కునే పనిలోనే ఉన్నాడు. తాజాగా అరుణ్ తనని ఇంటికొచ్చి రౌడీలు బెదిరించారని తెలిపాడు.
రెండేళ్ల క్రితం ఓ సినిమాకి అడ్వాన్స్ తీసుకున్నాని..ఫోటో షూట్ కూడా పూర్తయిన తర్వాత తనని పక్కన బెట్టి ఓ హీరో కుమారుడిని తీసుకున్నారన్నారు. అనంతరం ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసారుట. దీంతో కొపమొచ్చిన అరుణ్ అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోవడంతో ఇంటికి రౌడీలను పంపించి బెదిరించారని..అయినా తాను బెదరకుండా తనవైపు తప్పు ఉంటే ఇస్తానని..లేకపోతే ఇవ్వనని తెగేసి చెప్పేసరికి వెళ్లిపోయారని అన్నాడు.
అలాగే పా రంజిత్ 'ఆటకత్తి' సినిమాలో అరుణ్ నే హీరోగా అనుకున్నారుట. కానీ అప్పటికి చేతిలో కొన్ని సినిమాలు ఉండటంతో ఆసినిమా చేయలేకపోయినట్లు తెలిపాడు. అలాగే తన జీవితంలో మర్చిపోలేని ఓ సంఘటన గురించి రివీల్ చేసాడు. ఉద్వేగం సినిమా చేస్తోన్న సమయంలో ఇంటి నుంచి తల్లి చనిపో యిందని తండ్రి నుంచి ఫోన్ వచ్చినప్పుడు తానెంతటి క్షోభకి గురయ్యాడో తెలిపారు.
ఆ సమయంలో సినిమా షూటింగ్ కి రాలేనిన నిర్మాతకి ఎలా చెప్పాలో అర్దం కాక చాలా టెన్షన్ పడినట్లు తెలిపాడు. అలాంటి టెన్షన్ జీవితంలో ఏనాడు పడలేదన్నాడు. చేతిలో డబ్బు లేనప్పుడు ..చేసిన సినిమా ప్లాప్అయినప్పుడు టెన్షన్ కి గురి కాలేదని..తల్లి మరణం తనని ఎంతో కృంగ దీసిందని కన్నీటి పర్యంతం అయ్యాడు.