కప్పలు, పాములు, మొసళ్లను జుర్రేసిన నటుడు!
దీంతో ఆ రకమైన మాంసానికి చైనా ప్రజలు అలవాటు పడిపోయారు.
By: Tupaki Desk | 22 Feb 2025 6:30 PM GMTకప్పలు, పాములు, నత్తలు, మోసళ్లు, బల్లులు, చీమల్ని తినే జనం ఎక్కడ ఉన్నారంటే ఠక్కున అంతా చైనా పేరు చెబుతారు. చైనాలో ఏర్పడిన ఆహార కొరత కారణంగా అక్కడ జనాలకు ఏం దొరకక చివరికి వాటిని తిని ఆకలి నింపుకున్నారని చరిత్ర చెబుతుంది. దీంతో ఆ రకమైన మాంసానికి చైనా ప్రజలు అలవాటు పడిపోయారు. చైనా సహా ఇతర మరికొన్ని దేశాల్లో ఆ రకమైన వాటిని ఆహారంగా తీసుకుం టున్నారు.
అయితే నటుడు ఆదిత్యామీనన్ కూడా కప్పలు, పాములు, మోసళ్లను తిన్న వాడినే అంటున్నాడు. ఆదిత్య మీనన్ కి ట్రావెలింగ్ అలవాటు అట. ప్రపంచంలో దేశంలో రకరకాల ప్రాంతాలకు తిరగడం చాలా కాలంగా ఉన్నఅలవాటు అట. అందరూ తిరిగే పర్యాటక ప్రదేశాల కంటే ఎవ్వరూ వెళ్లని కొత్త ప్రాంతాల్లోకి వెళ్లి రావడం అలవాటు గా పెట్టుకున్నాడుట. అక్కడ సంస్కృతి, ప్రజల జీవిన విధానం వంటి వాటివి తెలుసుకోవడం తనకి ఆసక్తిగా చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో కప్ప కాళ్లు ఉదయం టిఫిన్ గా మధ్యాహ్నా భోజనంగా పాములు, సాయంత్రం స్నాక్స్ గా మొసళ్ల ముక్కల్ని తిన్నట్లు తెలిపాడు. ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అలాంటి ఆహారమే దొరుకుతుందని అలాంటప్పుడు తినక తప్పదు కదా? అన్నాడు. అవే గాక ఇంకా చాలా రకాల జంతు మాంసాలను కూడా రుచి చూసినట్లు తెలిపారు.
మాంసం అంటే కేవలం కోడి, మేక, గోర్రె కాదు వాటిని మిగతా చాలా రకాల జంతువులను తినే వాళ్లు చాలా మంది ఉన్నారన్నారు. ఆదిత్య మీనన్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా చాలా రకాల పాత్రలు పోషించారు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.