Begin typing your search above and press return to search.

రియల్ హీరోకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

ఐతే మంచి పని చేయడానికి స్టార్ స్టేటస్ అవసరం లేదని ప్రూవ్ చేస్తున్నాడు ఒకప్పటి హీరో ఆదిత్య ఓం.

By:  Tupaki Desk   |   27 Dec 2024 3:30 PM GMT
రియల్ హీరోకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
X

సినిమాల్లో హీరోగా నటించడం అందరు చేస్తారు కానీ ఆఫ్ స్క్రీన్ హీరోలా ప్రవర్తించడం మాత్రం అందరి వల్లా కాదు. తెర మీద హీరో ఏదైనా చేస్తాడు కానీ తెర వెనక హీరోలు చేసే మంచి పనులు ఏంటన్నది మాత్రం తెలియదు. ఐతే స్టార్స్ తమకు చేతనైన దానిలో మంచి పనులు చేస్తూ ఫ్యాన్స్ కి స్పూర్తిగా నిలుస్తూ వస్తున్నారు. ఐతే మంచి పని చేయడానికి స్టార్ స్టేటస్ అవసరం లేదని ప్రూవ్ చేస్తున్నాడు ఒకప్పటి హీరో ఆదిత్య ఓం. యూపీ నుంచి వచ్చి హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆదిత్య ఓం 2005 లోనే మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

లాహిరి లాహిరి లాహిరిలోతో హిట్ అందుకున్న అతను ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు కానీ ఎందుకో సరైన గుర్తింపు రాలేదు. ఐతే ఇక్కడ వర్క్ అవుట్ అవ్వట్లేదని బాలీవుడ్ వెళ్లి అక్కడ వెరైటీ సినిమాలు చేస్తూ వచ్చారు. నటుడిగానే కాదు డైరెక్టర్ గా మారి కొన్ని ప్రయత్నాలు చేశారు. ఐతే తనకు హీరోగా ఒక గుర్తింపు వచ్చేలా చేసిన తెలుగు ప్రజల మీద తన ప్రేమను చూపిస్తున్నాడు ఆదిత్య ఓం.

తన ఎడ్యులైట్మెంట్ సంస్థ ద్వారా గిరిజన గ్రామాలకు కావాల్సిన సేవా కార్యక్రమాలు అందిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణాలోని చెరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆదిత్య ఓం ఆ విలేజ్ రూపు రేఖలనే మార్చేశారు. గ్రామంలో పిల్లల చదువులకి ఆటంకం కలగకుండా ల్యాప్ టాప్ లతో పాటుగా స్ట్రీట్ లైట్స్ గా సోలార్ లైట్స్ ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆ ఊరిలో నీటి ద్వారా వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆర్.ఓ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఎక్కడో యూపీ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులు తనని ఆదరించారన్న ఒకే ఒక్క కారణం చేత ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆదిత్య ఓం ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఆదిత్య ఓం ఫాదర్ ఒక ఐ.ఏ.ఎస్ ఆఫీసర్.. తల్లి సమాజ్ వాదీ పార్టీలో కీలక నేత. అంతే కాదు తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఉన్నత పదవుల్లో ఉన్నారు. అయినా కూడా తెలుగు ప్రజల మీద తన ప్రేమ చూపిస్తున్నాడు ఆదిత్య ఓం. ఈ మధ్యనే బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన ఆదిత్య ఓం త్వరలోనే తాను చేపట్టిన ఆర్.ఓ ప్లాంట్ పూర్తి చేసి చెరుపల్లి గ్రామ ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించాలని చూస్తున్నారు. తన సంకల్పం గొప్పది కాబట్టే ఆయన చేస్తున్న పనులకు ఎలాంటి ఆటంకం కలగట్లేదు. విషయం తెలిసి చాలామంది ఈ రియల్ హీరోకి ఫ్యాన్స్ గా మారుతున్నారు.