బాడీ కార్న్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై కొత్త పెళ్లి కూతురు!
ఇటీవలే అదితి రావు హైదరీ నటుడు సిద్దార్ద్ ని రెండవ పెళ్లి చేసుకుని తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Oct 2024 9:30 PM GMTఇటీవలే అదితి రావు హైదరీ నటుడు సిద్దార్ద్ ని రెండవ పెళ్లి చేసుకుని తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నవ దంపతులు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇద్దరికీ పెద్దగా సినిమాలు కూడా లేకపోవడంతో? వెకేషన్లకు వెళ్లడం..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండటంతో టైంపాస్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దీపావళి దూసుకొస్తుడంటంతో ప్రీసెలబ్రేషన్లు అమ్మడు షురూ చేసింది.
ఇదిగో ఇక్కడిలా ఓ ఈవెంట్ లో అమ్మడు రెడ్ కార్పెట్ పై హొయలు పోయిన వైనం నెటి జనుల్ని ఆకర్షిస్తుంది. అద్భుతమైన బాడీ కార్న్ దుస్తుల్లో అమ్మడు మైమరపిస్తుంది. బ్లాక్ డిజైన్ ఎంపికలో సొగసరి అందరి దృష్టిని ప్రత్యే కంగా ఆకర్షిచింది. బ్లాక్ అండ్ వైట్ బాడీ కార్న్ క్లాసీ ఎంపికలో తళుకులీనింది. షో-స్టాపింగ్ స్ట్రాప్‌లెస్ గౌను బస్ట్ చుట్టూ తెల్లటి పూల అలంకారాలను కలిగిన డిజైన్ చూపరులను ఆకర్షిస్తుంది. డిజైన్ లో భాగంగా థై వద్ద సన్నని చీలిక సంథింగ్ స్పెషల్ గా నిలిచింది.
అన్నింటిని మించి డ్రెస్ డిజైన్ పై సైడ్ హ్యాండ్ బ్యాగ్‌తో జత చేయడంతో మరింత ఆకర్షణీయంగా హైలైట్ అవుతుంది. తెల్లిని ముత్యాల్లా మెరిసే డిజైన్ చెవిపోగుల గా ఎంపిక చేసుకుంది. సొగసైన సౌందర్య రూపాన్ని పరిపూర్ణం చేయడానికి అదితి సూక్ష్మమైన బ్లష్, ఐలైనర్, పెదాలకు ఎర్రని లిప్ స్టిక్ తో మరింత వెడెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. నెటి జనుల్ని కొత్త పెళ్లి కూతురు ఆకట్టుకుంటుంది.
ఇక అదితి కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడికి సరైన అవకాశాలు రావడం లేదు. గాంధీ టాక్స్ లో నటిస్తోంది. కానీ ఆ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ఇంగ్లీష్ లో లయన్స్ అనే ప్రాజెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం అది షూటింగ్ దశలో ఉంది.