Begin typing your search above and press return to search.

కుమార్తె ఆశ‌పడింది..తండ్రి క‌రుణిస్తాడా!

ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అలా అదితి ఖాతాలో వ‌రుస‌గా రెండు విజ‌యాలు న‌మోద‌య్యాయి.

By:  Tupaki Desk   |   31 Jan 2025 2:30 AM GMT
కుమార్తె ఆశ‌పడింది..తండ్రి క‌రుణిస్తాడా!
X

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అదితి శంక‌ర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే . ఇప్ప‌టికే రెండు విజ‌యాల‌తో ఫుల్ స్వింగ్ లో ఉంది. మ‌రో విజ‌యం ప‌డితే అమ్మ‌డి ఖాతాలో హ్యాట్రిక్ న‌మోదైన‌ట్లే. కార్తీ స‌ర‌స‌న న‌టించిన తొలిసిన 'వీరుమాన్' మంచి విజ‌యం సాధించింది. అటుపై రెండ‌వ చిత్రంలో శివ‌కార్తీకేయ‌న్ తో న‌టించింది. అదే 'మావీరన్'. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అలా అదితి ఖాతాలో వ‌రుస‌గా రెండు విజ‌యాలు న‌మోద‌య్యాయి.

ప్ర‌స్తుతం మూడ‌వ చిత్రం 'నెసిపియా'లో న‌టిస్తోంది. ఇటీవ‌లే 'వ‌న్స్ మోర్' అనే మ‌రో చిత్రంలోనూ ఎంపికైంది. అలాగే టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోంది. తండ్రి పెద్ద డైరెక్ట‌ర్ అయినా ఆ ఇమేజ్ ని ఎక్క‌డా వాడ‌కుండా త‌న‌కు తానుగా అవ‌క‌శాలు అందుకుంటుంది. మ‌న‌సుకు న‌చ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఇక వ్య‌క్తిగ‌తంగా అదితి ఎంతో డౌన్ టౌ ఎర్త్. ఎవ‌రితోనైనా ఇట్టే మాట క‌లుపుతుంది. స‌హ న‌టుల‌తో అంతే స‌ర‌దాగా ఉంటుంది.

అయితే కెరీర్ ప్రారంభ‌మై మూడేళ్లు అవుతున్నా? ఇంత‌వ‌ర‌కూ తండ్రి సినిమాలో న‌టించాల‌నే ఛాన్స్ తీసుకోలేదు. ఎక్క‌డా విష‌యాన్ని కూడా ఓపెన్ చేయ‌లేదు. అయితే తొలిసారి శంక‌ర్ సినిమాలో న‌టించాల‌ని ఉందనే ఆస‌క్తిని వెల్ల‌డించింది. మ‌రి కుమార్తెకు శంక‌ర్ ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్న‌ది అత‌డి చేతుల్లోనే ఉంది. ఇంత కాలం మ‌న‌సు లోనే ఉన్న విష‌యాన్ని తొలిసారి బ‌య‌ట పెట్టింది. అయితే అదితి ఇండ‌స్ట్రీకి కొన్ని కండీష‌న్ల‌తో ఎంట్రీ ఇచ్చింది.

మెడిసిన్ పూర్తిచేశాక సినిమాల్లోకి వ స్తానంటే? అందుకు శంక‌ర్ ఓ షరతు విధించారు. నిర్ణీత గ‌డువులోగా న‌టిగా స‌క్సెస్ అయితే ఒకే లేదంటే? తిరిగి వైద్య వృతికే అంకిత‌మ‌వ్వాల‌ని శంక‌ర్ కండీష‌న్ పెట్టారుట‌. అందుకు అదితి ఒకే చెప్పిన త‌ర్వాతే మ్యాక‌ప్ వేసుకుంది. ల‌క్కీగా స‌క్సెస్ అయింది. కెరీర్ లో ఇంకా పెద్ద హీరోయిన్ గా ఎద‌గాల‌ని నెటి జ‌నులు కోరుకుంటున్నారు.