శంకర్ డాటర్ వాటికి నో చెప్పిందా?
కొన్ని సన్నివేశాల్లో భాగంగా లిప్ లాక్ ల్లో నటించాలని దర్శకుడు ప్రపోజల్ పెట్టాడుట. దీంతో అదితి అలాంటి సన్నివేశాల్లో నటించనని తెగేసి చెప్పిందిట.
By: Tupaki Desk | 12 Oct 2024 5:52 AM GMTస్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ రెండు విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది. మరో విజయం పడితో అమ్మడి ఖాతాలో హ్యాట్రిక్ నమోదైనట్లే. కార్తీ సరసన నటించిన తొలిసిన 'వీరుమాన్' మంచి విజయం సాధించింది. అటుపై రెండవ చిత్రంలో శివకార్తీకేయన్ తో నటించింది. అదే 'మావీరన్'. ఇది బ్లాక్ బస్టర్ అయింది. అలా అదితి ఖాతాలో వరుసగా రెండు విజయాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మూడవ చిత్రం 'నెసిపియా'లో నటిస్తోంది.
ఇందులో ఆకాష్ మురళీకి జోడీగా నటిస్తోంది. ప్రభు, శరత్ కుమార్, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విజయం సాధిస్తే అదితి ఖాతాలో హ్యాట్రిక్ నమోదవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి హైప్ క్రియేట్ అవుతుంది. అయితే ఈసినిమాలో అదితి శంకర్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాలకు నో చెప్పిందట.
కొన్ని సన్నివేశాల్లో భాగంగా లిప్ లాక్ ల్లో నటించాలని దర్శకుడు ప్రపోజల్ పెట్టాడుట. దీంతో అదితి అలాంటి సన్నివేశాల్లో నటించనని తెగేసి చెప్పిందిట. ఈ విషయం కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకూ నటించిన రెండు చిత్రాల్లో అతిది అలాంటి సన్నివేశాల్లో నటించింది లేదు. రెండు సినిమాల్లో డీసెంట్ పాత్రలే పోషించింది. తన నటనతోనే మెప్పించింది. తెరపై తనలో బ్యూటీని సైతం అంతగా హైలైట్ చేయలేదు.
అలాంటింది ఒక్కసారిగా లిప్ లాక్ ప్రపోజల్ తీసుకెళ్లే సరికి కంగారు పడినట్లుంది. మరి ఈ విషయంలో దర్శకుడు ఇంకా ఒప్పించే ప్రయత్నాలు ఏవైనా చేస్తున్నారా? వదిలేసారా? అన్నది తెలియాలి. అలాగే అదితి శంకర్ టాలీవుడ్ డెబ్యూ ఫిక్సైన సంగతి తెలిసిందే. యువ దర్శకుడు విజయ్ కనక మేడల దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ద్వారా అమ్మడు పరిచయమవుతోంది.