సీక్రెట్ పెళ్లి, విడాకులపై స్పందించిన అదితి శర్మ
సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి లేదంటే విడాకులు.. ఇలా ఏదొక విషయం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.
By: Tupaki Desk | 14 March 2025 4:00 PM ISTసెలబ్రిటీల ప్రేమ, పెళ్లి లేదంటే విడాకులు.. ఇలా ఏదొక విషయం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. బుల్లితెర ఫేమస్ నటి, సైన్స్ డ్రామా అపోలీనా ఫేమ్ అదితి శర్మ, అభిజిత్ కౌశిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకుంది గతేడాది నవంబరులోనే. అంటే వీరికి పెళ్లై నాలుగు నెలలు.
ఈ నాలుగు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదితి, తన కో యాక్టర్ సమర్థ్య గుప్తాతో అత్యంత సన్నిహితంగా ఉండటం తాను చూశానని, ఇకపై అదితితో ఉండలేనని అభిజిత్ మీడియా ముందే చెప్పాడు. దీంతో వీరిద్దరూ కలిసి ఉండలేక విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరి విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే విడాకుల విషయంపై తాజాగా అదితి మాట్లాడింది. పెళ్లైన నెలకే ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయని, అభిజిత్ తనతో రూడ్‌గా, అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. తనని, తన కుటుంబాన్నీ అభిజిత్ అందరిముందు చాలా సార్లు కించపరిచేలా మాట్లాడేవాడని, కానీ తానెప్పుడూ తనని కానీ తన ఫ్యామిలీని కానీ తక్కువ చేయలేదని, అభిజిత్ ను మనస్పూర్తిగా ప్రేమించానని అదితి చెప్పింది.
తమ మధ్య మరెన్నో జరిగాయనీ, కానీ తమ విడాకుల కేసు కోర్టులో ఉన్నందున ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పిన అదితి, అందరూ తాము సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామంటున్నారనీ, తమ పెళ్లి గురించి తమ సన్నిహితులకు తెలుసని, కెరీర్ గ్రాఫ్ బాగున్న టైమ్ లో పెళ్లి చేసుకున్నానని తెలిస్తే బావుండదని, అసలే అపోలెనా సీరియల్ లో తాను 18 ఏళ్ల అమ్మాయిగా నటిస్తుండటంతో పబ్లిక్ కు తన పెళ్లి గురించి అప్పుడే చెప్పకూడదనుకున్నట్టు అదితి చెప్పుకొచ్చింది.
ఇకపోతే అదితి భర్త అభిజిత్ చేసిన ఆరోపణలను అపోలెనా సీరియల్ ఫేమ్ సమర్థ్య గుప్తా ఖండించాడు. అదితి, తాను సన్నిహితంగా ఉంటూ దొరికిపోయారనే మాటల్లో ఎలాంటి నిజం లేదని.. అదితి, తాను కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే జంటగా కనిపిస్తామని, అభిజిత్ చెప్పినట్టు తాము అడ్డంగా దొరికిపోయామనేది అబద్ధమని, ఇలాంటి కామెంట్స్ వల్ల తన తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు సమర్థ్య గుప్తా చెప్పాడు.