అదితి-సిధ్.. ప్రేమ ఎంత మధురం?
అదితిరావ్ హైదరీ - సిద్ధార్థ్ జంట ప్రేమాయణం గురించి తెలిసిందే. ఏడాదిన్నర కాలంగా ఈ జంటపై రకరకాలుగా పుకార్లు షికార్ చేస్తున్నా ఏదీ అధికారికంగా ధృవీకరించడం లేదు.
By: Tupaki Desk | 3 Jan 2024 4:02 AM GMTఅదితిరావ్ హైదరీ - సిద్ధార్థ్ జంట ప్రేమాయణం గురించి తెలిసిందే. ఏడాదిన్నర కాలంగా ఈ జంటపై రకరకాలుగా పుకార్లు షికార్ చేస్తున్నా ఏదీ అధికారికంగా ధృవీకరించడం లేదు. కలిసి ఉన్నారు.. కలిసే షికార్లు చేస్తున్నారు.. ప్రేమలో ఉన్నారు! అంటూ మీడియా చాలాకాలంగా ప్రచారం చేస్తోంది. ఈ ఊహాగానాల్ని నిజం చేస్తూ ఈ జంట తమ ప్రేమ కథను కొత్త సంవత్సరంలో మరో లెవల్ కి తీసుకెళతారని భావిస్తున్నారు.
తెలుగు సినిమా 'మహా సముద్రం'లో జంటగా కలిసి నటించాక ఇద్దరి మధ్యా స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీ సెట్లో చర్చగా మారింది. సినిమా ఫ్లాపైనా కానీ ప్రేమ పావురాల కొత్త జర్నీ పెద్ద సక్సెసైంది. సినిమా ఫలితం ముగిసినా కానీ, ఈ జంట కొత్త ప్రేమకథ ప్రజల్లో ఆసక్తిని కలిగించింది. అప్పుడప్పుడు అభిమానుల్ని టీజ్ చేసేందుకు అస్పష్టమైన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఈ జంట కన్ఫ్యూజ్ చేసింది.
ఇదంతా సరే.. కొత్త సంవత్సర వేడుకల కోసం ప్రేమ పక్షులన్నీ విదేశీ గూళ్లను వెతుక్కోగా సిధ్- అతిథి ఏ గూటికి చేరారు? అంటూ ఆరాలు కొనసాగుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రిలో అదితి రావు హైదరి- సిద్ధార్థ్ తమ సంబంధాన్ని అధికారికంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు హింట్ అందింది. ఇన్‌స్టాలో సిద్ధార్థ్ తో కలిసి ఉన్న అందమైన ఫోటోను షేర్ చేసి ''హ్యాపీ బ్లెస్డ్.. కృతజ్ఞతలు'' అని అదితి రాసింది. ప్రస్తుతానికి వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచాలనే ఆలోచన ఉంది. కానీ తమ మధ్య అనుబంధాన్ని దాచే ఆలోచన ఏదీ లేదు. కొత్త సంవత్సరంలో పెళ్లి గురించి ఏదైనా చెబుతారేమో చూడాలి.