థియేటర్లో ఒక్కడే హీరో..కానీ ఓటీటీలో అంతా హీరోలే!
తాజాగా ఓటీటీ కంటెంట్ని ఉద్దేశించి బాలీవుడ్ బ్యూటీ ఆతిది రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 29 April 2024 6:21 AM GMTఓటీటీ అందుబాటులోకి వచ్చాక ఎంటర్ టైన్ మెంట్ తీరు మారిన సంగతి తెలిసిందే. థియేటర్ కే వెళ్లి చూడాలి? అనే టాపిక్ లేదు. థియేటర్ కాకపోతే ఓటీటీ అనే ఆప్షన్ ఒకటుందిగా! అప్పుడు చూసుకుందామనే లెక్కలోకి జనాలు వచ్చేసారు. అందుకు తగ్గట్టే ఓటీటీ ఎంతో మంచి క్వాలిటీ కంటెట్ని అందిస్తుంది. సినిమాల కంటే గొప్ప ఎంటర్ టైన్ మెంట్ ఓటీటీలో నే దొరుకుతుందన్న వాదన గట్టిగానే వినిపిస్తుంది. డాక్యుమెంటరీలు..వెబ్ సిరీస్ లంటూ! ఇలా కొత్త తరహా ఎంటర్ టైన్ మెంట్ ఓటీటీలో దొరుకుతుంది.
నవతరం ప్రతిభావంతులు వాటి ద్వారా వెలుగులోకి వస్తున్నారు. డే బై డే ఓటీటీ అంతంకంతకు అప్డేట్ అవుతుంది. దాంటో పాటు ఆదరణ కూడా రెట్టింపు అవుతుంది. తాజాగా ఓటీటీ కంటెంట్ని ఉద్దేశించి బాలీవుడ్ బ్యూటీ ఆతిది రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ ప్లాట్ ఫాం అందుబాటులోకి వచ్చాక నటీనటులు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినిమాలే చేయాలి అన్న నిబంధన తొలగిపోయింది. ఒకప్పుడు సినిమా అనేది బలంగా కనిపించేది.
కానీ ఇప్పుడా ప్రభావం పెద్దగా లేదు. సినిమా లేకపోతే ఓటీటీ ఆప్షన్ ఉందిగా అన్న ధీమా ఔత్సాహికుల్లో కనిపిస్తుంది. థియేటర్లో వచ్చే సినిమాలో ఒక్కరే హీరో ఉంటారు. కానీ ఓటీటీలో అంతా హీరోలే. ఎవరికి వారే హీరో పాత్రలు పోషిస్తుంటారు. నాకు ఈ రెండు మాధ్యమాలు ఇష్టమే. కానీ సినిమాలకంటే ఓటీటీలోనే మంచి కంటెంట్ అందుబాటులో ఉంటుంది అన్నది వాస్తవం. వ్యక్తిగతంగా ఓటీటీ కంటెట్కి బాగా కనెక్ట్ అవుతున్నాను.
ఇవి ప్రేక్షకుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. 'హీరామండి' కూడా త్వరలో ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. మంచి సిరీస్ ఇది. వాస్తవ జీవితాల్ని ప్రతిబింబిస్తుంది. నా అభిమాన దర్శకుడు కూడా సంజయ్ గారే. ఆయన సినిమాలో పాత్రలు ఎంతో బలంగా కనిపిస్తాయి. అలాంటి పాత్రలు సృష్టించడం ఆయనకే సాధ్యమైంది. 'పద్మావత్' లో నటించా. మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను' అని అన్నారు.