Begin typing your search above and press return to search.

వీడియో: కేన్స్‌లో అదితీరావ్ గ‌జ‌గామిని వాక్

అదితి రావ్ హైదరి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

By:  Tupaki Desk   |   24 May 2024 1:56 PM GMT
వీడియో: కేన్స్‌లో అదితీరావ్ గ‌జ‌గామిని వాక్
X

భ‌న్సాలీ 'హీరామండి'లో వేశ్య పాత్ర‌లో అద్భుత‌మైన అభిన‌యంతో క‌ట్టి ప‌డేసిన అదితీరావ్ హైద‌రీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదితీలోని సమ్మోహనకరమైన 'గజగామిని నడక'ను తెర‌పైకి తేవ‌డంలో భ‌న్సాలీ విజ‌న్ అంద‌రినీ ఆక‌ర్షించింది. ఆ ప్ర‌దర్శన వైరల్ అయ్యింది. ఇప్పుడు అదితీ కేన్స్ ఉత్స‌వాలు జ‌రుగుతున్న‌ ఫ్రెంచ్ రివేరాలో తన నడకను పునఃసృష్టించింది. అదితి రావ్ హైదరి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

ఈ వీడియోలో 'సైయాన్ హతో జావో' (హీరామండి) పాటలోని తన వైరల్ 'గజగామిని నడక'ని రీక్రియేట్ చేస్తూ కనిపించింది. హైదరీ త‌న అనుచ‌ర బృందంతో కలిసి హొయ‌లొలికిస్తూ ఈ అంద‌మైన‌ నడకను ప్రదర్శించింది. గౌరీ- నైనికా నుండి అద్భుతమైన బ్లాక్ అండ్ ఎల్లో ఫ్లోర‌ల్ దుస్తులు ధరించింది. అదితీ తన పోస్ట్‌లో వాకింగ్ ఇన్ కేన్స్ లైక్ (సన్ ఎమోజి, క్లౌడ్ ఎమోజీ) అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో త‌న‌దైన సొగ‌సును హైలైట్ చేసిన ఈ వీడియో వేగంగా అంద‌రి దృష్టిని ఆకర్షించింది.

'గజగామిని' నడక అంటే ఏమిటి?

అదితీరావు హైదరీ 'గజగామిని నడక'కు ఒక అర్థం ఉంది. అది గంభీరమైన ఏనుగు నడక అని అర్థం. దేవదత్ పట్నాయక్ 'ఎలిఫెంట్ లోర్' ప్రకారం, శృంగార సాహిత్యంలో ఏనుగులు తరచుగా అనియంత్రిత లైంగిక శక్తికి చిహ్నాలు. మహాభారతం వంటి చారిత్రిక గ్రంథాలు ద్రౌపది వంటి రాణులను 'మద-గజ-గామిని' అని సూచిస్తాయి, దీనిని 'ఆవు-ఏనుగులలాగా కదులుతున్న మహిళ' అని అర్థాన్నిదిస్తుంది. సాహిత్య అనువాదం ప్రత్యేకించి ఆకర్షణీయంగా అనిపించకపోయినా కానీ.. ఇంద్రియాలను ఆక‌ర్షించే విలాసవంతమైన పెద్ద హిప్డ్ న‌డుముతో ఉండే స్త్రీ అనే అర్థాన్ని క‌లిగి ఉంది.

గ‌తంలో గ‌జ‌గామిని న‌డ‌క గురించి అదితీ ఇలా మాట్లాడింది. కథక్‌లో మయూర్ చాల్ (నెమలి నడక).. గజగామిని (సమ్మోహన నడక) ఉందని నాకు తెలుసు.. కానీ అది అన్ని నృత్య రూపాల్లో ఉంటుందని నేను క‌చ్చితంగా భావించాను. కానీ నాకు ఇది తెలియదు. నేను అలా చేయాలి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా.. రీల్‌పై రీల్ చేసినా.. ఆ తుక్డా (ముక్క) మొత్తం వైరల్ అయింది. అతడు (సంజయ్) స్పాట్‌లో మ్యాజిక్‌లను గుర్తించడంలో చాలా తెలివైన‌వాడు. అతడు గ‌జ‌గామిని వాక్ ని చేసి చూపించాడు. ఆ దుపట్టా ఒక నిర్దిష్ట బీట్‌పై పడాలని, తల తిప్పాలని చాన్ (ఘుంగ్రూ శబ్దం) సరిగ్గా బీట్‌లో రావాలని కోరుకుంటున్నానని త‌న‌ ఆలోచనను తెలిపారు. సంజయ్ స‌ర్ చెప్పిన దానిని అనుస‌రించాను.. అని అదితీ తెలిపాఉ.

కేన్స్‌లో అదితి మెరుపులు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. ఇప్పుడు ఐకానిక్ గ‌జ‌గామిని వాక్ తో మ‌రింత‌గా ఆక‌ట్టుకుంది. కేన్స్ 2024లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో అదితీ అంద‌రినీ అల‌రిస్తోంది.