బాలయ్యతో మళ్లీ టైమ్ ట్రావెల్‌కి సిద్దమా...!
టాలీవుడ్ హీరోల్లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఫ్యూచర్‌లోకి, గతంలోని శ్రీకృష్ణదేవరాయ కాలానికి వెళ్లిన హీరోగా బాలకృష్ణ నిలిచారు. బాలకృష్ణ కెరీర్‌లో నిలిచి పోయే విధంగా ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
By: Tupaki Desk | 26 Feb 2025 9:50 AM GMTనందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో విభిన్న సినిమాల్లో నటించారు. ఆయన నటించిన పలు బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్‌కి నూటికి నూరు శాతం అర్హం అనడంలో సందేహం లేదు. బాలయ్య నటించిన కొన్ని సినిమాలు ఎప్పటికీ అన్ని వర్గాల వారిని అలరిస్తూనే ఉంటాయి. అందులో ఆదిత్య 369 సినిమా ఒకటి. సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో బాలకృష్ణ టైమ్ ట్రావెల్ చేసి గతంలోకి వెళ్తాడు. అంతే కాకుండా ఫ్యూచర్‌లోకి బాలకృష్ణ వెళ్తాడు. అప్పట్లో సినిమా సంచలనం సృష్టించింది. టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గొప్పతనం గురించి అంతా ప్రశంసించారు.
టాలీవుడ్ హీరోల్లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఫ్యూచర్‌లోకి, గతంలోని శ్రీకృష్ణదేవరాయ కాలానికి వెళ్లిన హీరోగా బాలకృష్ణ నిలిచారు. బాలకృష్ణ కెరీర్‌లో నిలిచి పోయే విధంగా ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా సినిమా మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. 1991లో విడుదలైన ఆదిత్య 369 కి ఆ మధ్య సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది. బాలకృష్ణ వద్ద ఇప్పటికీ సీక్వెల్ ఆలోచన ఉందనే వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞతో కలిసి తాను సీక్వెల్‌లో నటిస్తాను అంటూ గతంలో ఒక సారి బాలకృష్ణ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య 369 సీక్వెల్ గురించి చెప్పిన విషయం తెల్సిందే.
ఆదిత్య 369 సీక్వెల్ కోసం అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ ఏమో గానీ ఆదిత్య 369 మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు మహా శివ రాత్రి సందర్భంగా ఆదిత్య 369 పోస్టర్‌ను విడుదల చేశారు. మహా శివ రాత్రి శుభాకాంక్షలు చెబుతూ ఇప్పుడు ఆదిత్య 369 పోస్టర్ వేయడం మాత్రమే కాకుండా థియేటర్‌లో త్వరలో రాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. ఆదిత్య 369 సినిమాను కేవలం బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సైతం కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమధ్య కాలంలో రీ రిలీజ్‌లు ఎక్కువ అవుతున్నాయి.
బాలకృష్ణ నటించిన పలు సినిమాలు సైతం రీ రిలీజ్ అయ్యాయి. అయితే ఆదిత్య 369 సినిమా కచ్చితంగా బెస్ట్ ఛాయిస్ రీ రిలీజ్‌కి అనే అభిప్రాయంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద బాలయ్య జోరు ఈమధ్య కాలంలో ఓ రేంజ్‌లో ఉంది. అందుకే ఈ రీ రిలీజ్‌కి సైతం మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ సినిమాతో రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకున్నాడు. దాంతో ఆయన ప్రతి సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఆదిత్య 369 రీ రిలీజ్ అనేది కచ్చితంగా మంచి ఫలితాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.