మీటూ ఆరోపణలున్నా నటుడి సంచలన నిర్ణయం
ప్రముఖ నటుడు ఆదిత్య పాంచోలి తమపై అత్యాచారం చేసాడంటూ పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేసారు.
By: Tupaki Desk | 7 Dec 2024 7:22 AM GMTప్రముఖ నటుడు ఆదిత్య పాంచోలి తమపై అత్యాచారం చేసాడంటూ పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేసారు. క్వీన్ కంగన రనౌత్ సైతం గతంలో ఓ ఇంటర్వ్యూలో పాంచోలి తనను బెదిరించాడని ఆరోపించారు. 2019లో ఓ ప్రముఖ నటి ఆరోపించడంతో దానిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి పోలీసులు విచారణ సాగించారు. ఆ తర్వాత అతడు కోర్టుల పరిధిలో దీనిని ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగానే అతడి భార్య జరీనా వహబ్ "అతడు అలాంటి వాడు కాదు! స్వీటెస్ట్ పర్సన్!! తమకు అనుకూలంగా లేడనే కారణంగానే మాజీ గాళ్ ఫ్రెండ్స్ తప్పుడు ఆరోపణలు చేసారు!`` అంటూ తనకు మద్ధతుగా నిలిచారు.
ఇప్పుడు తనకు ఆపాదించిన ఇమేజ్ కి భిన్నంగా.. ఆదిత్య పంచోలి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తన మరణానంతరం వైద్య పరిశోధన కోసం శరీరాన్ని విరాళంగా ప్రకటించాడు. ఇది ఆరోగ్య సంరక్షణ పరిశోధన, విద్యకు మద్దతునిచ్చే ఉద్దేశ్యం. డిసెంబర్ 13న లయన్ గోల్డ్ అవార్డ్స్‌లో అధికారిక ప్రకటన చేయబోతున్నాడు. సమాజానికి అర్థవంతమైన మార్గాల్లో తిరిగి ఇవ్వడంలోనే నిజమైన హీరోయిజం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆదిత్య పంచోలి నిర్ణయం స్ఫూర్తివంతమైనది. ఆయన ప్రకటన సారాంశం ఇలా ఉంది. "మనం తెరపై హీరోలుగా నటిస్తాము.. అయితే నిజమైన హీరోయిజం సమాజానికి అర్ధవంతమైన మార్గాల్లో తిరిగి ఇవ్వడంలో ఉంది. నా శరీరాన్ని దానం చేయడం ద్వారా.. ఈ దాతృత్వ చర్యను పరిగణనలోకి తీసుకునేలా ఇతరులను ప్రేరేపించాలని నేను ఆశిస్తున్నాను.. ఇది నిజమైన మార్పును కలిగిస్తుంది. మరణంలో కూడా నేను ప్రపంచానికి సహాయాన్ని కొనసాగించాలనుకుంటున్నాను" అని అన్నారు.
డాక్టర్ లయన్ రాజు మన్వానీ దీనిపై మాట్లాడుతూ.. ఆదిత్య పంచోలీని మెచ్చుకున్నారు. ఇది చాలా ధైర్యం .. కరుణతో కూడిన చర్య! అని పేర్కొన్నారు. "ఇది అతని అసాధారణ వ్యక్తిత్వాన్ని మానవత్వాన్ని చాటడం తో అలాంటి నిస్వార్థ సేవ ఇతరులను తాము కూడా ఎలా మార్చకోగలరో ఆలోచించేలా ప్రోత్సహిస్తాయి. ఈ విరోచిత ఆలోచనను నిజంగా అభినందిస్తున్నాను" అని అన్నారు.
భార్య జరీనా కితాబు....
ఆదిత్య పాంచోలిపై పలు అత్యాచార ఆరోపణలు ఉన్నా... అతడి భార్య జరీనా వహబ్ తనకు అన్నివిధాలా మద్ధతుగా నిలిచారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో జరీనా వాహబ్ మాట్లాడుతూ... వారి శాశ్వత బంధం గురించి నిజాయితీగా మాట్లాడారు. తన భర్త తో ముడిపడి ఉన్న గత వివాదాలను జరీనా ప్రస్తావించారు. అతడు ఎప్పుడూ వేధించే భర్త కాదు. అతడు అలాంటి ప్రియమైనవాడు. అలాంటివి ఏవైనా ఉంటే నేనే కొట్టేదానిని. కానీ అతడు నిజంగా స్వీట్. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ వారు కోరుకున్నది లభించనందున ఈ ఆరోపణలు చేశారు" అని వివరణ ఇచ్చారు.