93 లో సింగీతం రీ-రిలీజ్ ఈవెంట్ కి!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన `ఆదిత్య 369` మళ్లీ మూడు దశాబ్ధాల తర్వాత రీ-రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 March 2025 8:30 AMసీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన `ఆదిత్య 369` మళ్లీ మూడు దశాబ్ధాల తర్వాత రీ-రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 4కె ఫార్మాట్ లో రీ-రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య, ఇంద్రజ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లోనే ఎంతో అడ్వాన్స్ గా తీసిన చిత్రంగా రికార్డు సృస్టించింది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఆధారంగా తీసిన సినిమా ఇప్పటికీ ఓ అద్భుతంలా ఉంటుంది.
ప్రేక్షకుల అభిరుచుని గమనించే మళ్లీ ఈ చిత్రాన్నిరీ-రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రీ-రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. అందుకు హైదరాబాద్ వేదిక అయింది. భారీ ఎత్తున అభిమానుల సమక్షలో ఈవేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బాలయ్య, ఇంద్రజ సహా అప్పటి టీమ్ అంతా హాజరవుతుంది.
ప్రత్యేకంగా దర్శకుడు సింగీతం తప్పక హాజరవుతున్నారు. ఇప్పుడు సింగీతం వయసు 93 ఏళ్లు. అంటే ఆయన 60 ఏళ్ల వయసులో ఈచిత్రాన్ని తీసారు. అప్పట్లోనే ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. సింగీతం ...బాలయ్య కలిసి చేసిన మరో భారీ ప్రయోగం కావడంతో? సినిమా ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేసారు. అనుకున్నట్లే సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసి మంచి ఫలితాలు సాధించారు.
మళ్లీ ఇప్పుడు 93 ఏళ్ల వయసులో తన సినిమా ఈవెంట్ కి రావడం విశేషం. ఆ రకంగా సింగీతం రికార్డు సృష్టించారని చెప్పాలి. ఇలా 93 ఏళ్ల వయసులో ఏ డైరెక్టర్ తన సినిమా రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా హాజరైన సన్నివేశం ఎక్కడా చోటు చేసుకోలేదు. తొలిసారి ఆ ఛాన్స్ సింగీతంకి మాత్రమే వచ్చింది. ఆ రకంగా ఆయన ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. ఈ వేదికపై లెజెండరీ డైరెక్టర్ ని నాటి టీమ్ సత్క రించే అవకాశం ఉంది.