హీరో అయినా ఇప్పటికీ ఆడిషన్స్ కి ఆ నటుడు!
నేను ఎన్నో ఆడిషన్స్ లో పాల్గొన్నాను. చాలా వాటిలో తిరస్కరణకి గురయ్యాను. కానీ తిరస్కరణలు ఎప్పుడు నాపై ప్రభావాన్ని చూపలేదు
By: Tupaki Desk | 28 July 2023 6:15 AM GMTహీరోగా ప్రతయ్నాలు చేసే సమయంలో..ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు..రకరకాల ఛాలెంజ్ లు అధిగమించాల్సి ఉంటుంది. అవన్ని దాటుకుని వస్తేనే పరిశ్రమలో నిలబడేది. సక్సెస్ దిశగా అడుగులు పడేది. ఏ స్టార్ కి ఓవర్ నైట్ లో సక్సెస్ రాదు. అందులోనూ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ల పరిస్థితి గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అయితే సక్సెస్ అయిన తర్వాత మళ్లీ మొదట్లో పడినన్ని కష్టాలుండవు.
జీవితం సాపీగా సాగిపోతుంది. అన్ని కాళ్ల వద్దకే వస్తాయి. కానీ వాటిని అందరూ స్వీకరించరు అని బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్ తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తుంది. ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
'నేను ఎవరి సహకారం లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాను. నా సోదరుల సహకారం కూడా లేకుండా పరిశ్రమలో నా సొంత మార్గాన్ని నిర్దేశించుకున్నాను. ఈ విషయం అభిమానులకు కూడా తెలుసు. చిన్న సపోర్టింగ్ పాత్రలు చేస్తూ ఇప్పుడు మీ ముందున్నాను. జీవితంలో నా ఎదుగుదలను ప్రజలు చూస్తున్నారు నేను ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తూనే మూడు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసాను.
నేను ఎన్నో ఆడిషన్స్ లో పాల్గొన్నాను. చాలా వాటిలో తిరస్కరణకి గురయ్యాను. కానీ తిరస్కరణలు ఎప్పుడు నాపై ప్రభావాన్ని చూపలేదు. నటులు కావాలనుకుంటే తిరస్కరణలకు కూడా అందులో భాగమేనని విశ్వసించాలి. ఆరేజే గా పనిచేసాను. అంతకు ముందు ఇంకెన్నా. అసలు నేను నటనవైపు వస్తానని అనుకోలేదు. నాకిది అనుకోకుండా వచ్చిన అవకాశం.
ఇప్పటికి కూడా ఆడిషన్స్ కి వెళ్తుంటాను. ఎందుకంటే ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో తెలియదు. ప్రతీ డోర్ తడితే! మనమేంటో తెలుస్తుంది. వాళ్లెంటో మనకు కూడా తెలుస్తుంది. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే? వృదాగానే మిగిలిపోతాం' అని అన్నాడు.