పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా చేసారేంటి?
బాలీవుడ్ జోడీ అనన్యా పాండే-ఆదిత్యరాయ్ కపూర్ రెండేళ్లగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 6 May 2024 2:30 AM GMTబాలీవుడ్ జోడీ అనన్యా పాండే-ఆదిత్యరాయ్ కపూర్ రెండేళ్లగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఒకర్ని విడిచి ఒకరు లేనంతగా క్లోజ్ అయ్యారు. విదేశీ వెకేషన్ల దగ్గర నుంచి ముంబై వీధుల వరకూ ఈ జోడీ కనిపించిన స్పాట్ అంటూ లేదు. కాలం గడిచే కొద్ది ఇద్దరి మధ్య బందం మరింత బలపడింది. దీంతో ఇరువురు పెళ్లికి సైతం సిద్దమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తల్లిదండ్రుల్ని ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటవుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో బలమైన కథనాలే వైరల్ అయ్యాయి.
అయితే నేడు సీన్ అందుకు రివర్స్ లో కనిపిస్తుంది. ఇద్దరు రెండేళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నట్లు ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ జోడీకి సన్నిహితంగా ఉండే ఒకరు ధృవీకరించారు. `వారిద్దరు నెల కిందటే విడిపోయారు. ఇది మాకు సైతం షాక్ ని కలిగించింది. వారు జీవితంలో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు` అని పేర్కొన్నారు. ఈ జంట చివరిగా ముకేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకకు జంటగా హాజరైన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత నుంచి ఎక్కడా కలిసి కనిపించలేదు. దీంతో ఇద్దరు ఎవరి సినిమా పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారనుకున్నారు. కానీ ఇద్దరి మద్య వ్యవహారం విడిపోయేంతగా వచ్చిందన్నది తెలియలేదు. అయితే ఈ విషయాన్ని అనన్యా పాండే గానీ..ఆదిత్య కానీ ఇంకా కన్పమ్ చేయలేదు. అలాగే విడిపోవడానికి గల కారణాలు ఏంటి? అన్నది కూడా తెరపైకి రాలేదు. మరి ఇదంతా నిజమా? అబద్దమా? అన్నది తేలాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో మునుపటి కంటే బాలీవుడ్ లో బ్రేకప్ లు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి పెద్దగా గ్యాప్ తీసుకోవడం లేదు. గడిచిన ఈ రెండేళ్ల కాలంలో బ్రేకప్ లు కంటే వివాహలే ఎక్కువగా ఉన్నాయి. అన్యన్యా పాండే- ఆదిత్య కూడా ఒకటవుతారనే అంతా భావించారు. కానీ కాలం మరోలా దారి తీసింది. ఇక వృత్తి పరంగా ఇద్దరు బిజీగానే ఉన్నారు. అనన్యా పాండే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అమ్మడు లైగర్ సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయింది. కానీ ఆ సినిమా ప్లాప్ అయింది. దీంతో ఆ సినిమాపై అమ్మడు నెగిటివ్ కామెంట్ కూడా చేసింది.