అడివి శేష్.. హై లెవెల్లో బ్రాండ్ ఇమేజ్..
ఈ రెండు సినిమాల షూటింగ్‌తోనే కాకుండా, మరొక సినిమా ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు.
By: Tupaki Desk | 1 Nov 2024 3:09 PM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ నటుడిగా అడివి శేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు. “మేజర్” వంటి సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన “గూఢచారి 2” (G2) మరియు “డెకాయిట్” (Dacoit) సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు భారీ అంచనాలతో 2025లో విడుదల కానున్నాయి.
ఈ రెండు సినిమాల షూటింగ్‌తోనే కాకుండా, మరొక సినిమా ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు. ఈ స్పీడ్‌తో, 2025లో అడివి శేష్ మరో మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. సినిమాల విషయంలోనే కాదు, బ్రాండ్ అంబాసిడర్‌గా అడివి శేష్ కొత్త దారిని ఎంచుకున్నారు. ఒక పక్క సినీ ప్రయాణంలో సక్సెస్ సాధిస్తూ, మరో పక్క ప్రముఖ బ్రాండ్లతో కలసి పని చేస్తూ మల్టీ డైమెన్షనల్ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
ఇటీవల, అతను అహా గోల్డ్ (aha Gold) అనే NRI క్లోతింగ్ బ్రాండ్‌కి, అలాగే ప్రముఖ డిజైనర్ బ్రాండ్ మేబాజ్ (Mebaz) కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యాడు. ఈ రెండు బ్రాండ్లు మాత్రమే కాదు, మరో మూడు ప్రధానమైన బ్రాండ్ భాగస్వామ్యాలను కూడా అతను ఇటీవల సంపాదించాడు. అదేవిధంగా అడివి శేష్ ఆడియెన్స్ ను సరికొత్తగా ఆకట్టుకునేలా యునిక్ కథలను ఎంచుకుంటూ తన ఫ్యాన్ బేస్‌ను విస్తరిస్తున్నాడు.
ప్రతి సినిమాతోనే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి, ఆయన ఎంచుకునే కథలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటితో పాటు, అతను ఇప్పుడు తన వ్యక్తిగత ఇమేజ్ను కూడా ఒక బ్రాండ్‌గా ఎదగిస్తున్నారు. ఆహా గోల్డ్ వంటి బ్రాండ్లు అతనిని ఎంచుకోవడం ద్వారా యువత, NRI ప్రేక్షకులలో మరింత దగ్గర చేస్తున్నాయి. మేబాజ్ వంటి డిజైనర్ బ్రాండ్‌తో కలసి పని చేయడం ద్వారా ఫ్యాషన్ వర్గానికి సంబంధించిన ప్రేక్షకులను ఆకర్షించడానికి అడివి శేష్ ప్రయత్నిస్తున్నారు.
ఈ బ్రాండ్లతో సహా ఇతర బ్రాండ్ భాగస్వామ్యాలు కూడా అతని క్రేజ్‌ను, మార్కెట్ పట్ల ఆకర్షణను మరింత పెంచాయి. అడివి శేష్ వలె ఒక యంగ్ యాక్టర్ తక్కువ కాలంలోనే ఈ స్థాయి బ్రాండ్ అంబాసిడర్షిప్లు సంపాదించడం తెలుగు పరిశ్రమలో అరుదు. ఇక రాబోయే సినిమాలతో కూడా అడివి శేష్ హై లెవెల్లో సక్సెస్ అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.