నాని హిట్3లో బలమైన పాత్రలో అడివి శేష్
శ్రీనిథి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 1 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.
By: Tupaki Desk | 18 Feb 2025 6:10 AM GMTనేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హిట్ ది థర్డ్ కేస్. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నాని తన సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శ్రీనిథి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 1 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ పొందిన హిట్ ఫ్రాంచైజ్ సిరీస్ నుంచి ఎప్పుడెప్పుడు మూడో భాగం రిలీజవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న హిట్3పై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో హిట్3 ను నాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
హిట్ ది ఫస్ట్ కేస్ లో విశ్వక్ సేన్ హీరోగా కనిపించగా, హిట్ ది సెకండ్ కేస్ లో అడివి శేష్ హీరోగా కనిపించాడు. ఇప్పుడు హిట్ ది థర్డ్ కేస్ లో నాని నటిస్తున్నాడు. హిట్3లో నాని అర్జున్ సర్కార్ గా చాలా పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు హిట్2 క్లైమాక్స్ లోనే క్లారిటీ ఇచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు క్లైమాక్స్ దశకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, హిట్3లో అడివి శేష్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అడివి శేష్ కోసం హిట్3 లో డైరెక్టర్ శైలేష్ చాలా బలమైన పాత్ర రాశాడని, ఆ పాత్ర కనిపించినప్పుడు ఆడియన్స్ తప్పకుండా సర్‌ప్రైజ్ ఫీలవుతారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు హిట్3పై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.
సరిపోదా శనివారం సినిమాతో సక్సెస్ అందుకున్న నాని, ఇప్పుడు హిట్3 సినిమాను చేస్తూనే మరోవైపు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమాను చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే శ్రీకాంత్, నాని కలయికలో వచ్చిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ది ప్యారడైజ్ పై కూడా హైప్ బాగా ఉంది.