Begin typing your search above and press return to search.

2025.. అడివి శేష్ 3 సినిమాల టార్గెట్..!

టాలీవుడ్ యువ హీరోల్లో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకున్నాడు అడివి శేష్

By:  Tupaki Desk   |   21 Sep 2024 4:38 PM GMT
2025.. అడివి శేష్ 3 సినిమాల టార్గెట్..!
X

టాలీవుడ్ యువ హీరోల్లో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకున్నాడు అడివి శేష్. కెరీర్ మొదట్లో కూడా ప్రయోగాలు చేసినా పెద్దగా ప్రేక్షకుల మెప్పు పొందలేని శేష్ క్షణం సినిమా నుంచి తన సూపర్ హిట్ మేనియా కొనసాగిస్తున్నాడు. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ అడివి శేష్ సినిమా అంటే కచ్చితంగా విషయం ఉంటుంది అనిపించేలా చేసుకున్నాడు. ఐతే అడివి శేష్ సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. 2022 లో మేజర్, హిట్ 2 సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు అడివి శేష్.

ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2, డకాయిట్ సినిమాలు చేస్తున్నాడు. జి2 ని వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. డెకాయిట్ సినిమాను షానీల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. గూఢచారి 2, డకాయిట్ వేటికవే ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పరచుకున్నాయి. ఐతే ఈ సినిమాల రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఐతే రెండేళ్లు అవుతున్నా అడివి శేష్ సినిమాల రిలీజ్ పై ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది.

అందుకే సోషల్ మీడియాలో అడివి శేష్ ని ట్యాగ్ చేస్తూ సినిమాల రిలీజ్ గురించి అడుగుతుంటారు. ఐతే ఈసారి సర్ ప్రైజింగ్ గా అడివి శేష్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. 2025 లో తనవి 3 సినిమాలు వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు అడివి శేష్. ఐతే సెట్స్ మీద ఉన్న జి2, డకాయిట్ ఓకే మరి 3వ సినిమా ఏదై ఉంటుందా అనే కన్ ఫ్యూజన్ మొదలైంది.

రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అడివి శేష్ 2025 లో మాత్రం 3 సినిమాలతో అలరించనున్నాడని తెలుస్తుంది. జి2, డకాయిట్ సినిమాలతో పాటు థర్డ్ సినిమాతో కూడా అడివి శేష్ రాబోతున్నాడు. ఐతే ట్విట్టర్ లో చెప్పడం వరకు ఓకే కానీ నిజంగానే అడివి శేష్ 3 సినిమాలు నెక్స్ట్ ఇయర్ వస్తాయా అన్న డిస్కషన్ మొదలైంది. 3 అని చెప్పినా జి2, డకాయిట్ సినిమాలైతే వచ్చే ఏడాది సందడి చేయడం పక్కా అని చెప్పొచ్చు. మరి ఈ రెండు సినిమాలతో అడివి శేష్ ఎలాంటి హంగామా చేస్తారన్నది చూడాలి.