శేష్ ఇంత లేట్ చేస్తే ఎలా?
అదే సినిమా ఫ్లాప్ అయితే మరోసారి అలాంటి ఫ్లాప్ రాకూడదనే ఆలోచనతో మరింత జాగ్రత్త పడతారు. అడివి శేష్ ఇప్పుడు ఆ కోవలోకే వస్తాడు.
By: Tupaki Desk | 3 March 2025 12:43 PM ISTఎవరైనా సరే తాము చేసిన సినిమాలకు వచ్చే రిజల్ట్స్ ను బట్టే నెక్ట్స్ స్టెప్ వేస్తారు. సినిమా మంచి హిట్ అయితే, దాన్ని కాపాడుకోవడానికి అంతకంటే మంచి కథ కోసం కొంచెం ఆలస్యమైనా వెయిట్ చేస్తారు. అదే సినిమా ఫ్లాప్ అయితే మరోసారి అలాంటి ఫ్లాప్ రాకూడదనే ఆలోచనతో మరింత జాగ్రత్త పడతారు. అడివి శేష్ ఇప్పుడు ఆ కోవలోకే వస్తాడు.
కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్న అడివి శేష్ నుంచి హిట్2 తర్వాత మరో సినిమా వచ్చింది లేదు. అంటే శేష్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు దాటి పోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేయాలనే రూల్ పెట్టుకుని దానికనుగుణంగానే శేష్ అడుగులేయడంతో తన సినిమాల విషయంలో లేటవుతూ వస్తుంది.
ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎంతగానో ఆలోచించిన శేష్ ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం డెకాయిట్, జి2 సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తున్న అడివి శేష్ ఆ సినిమాలను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడనే విషయంలో మాత్రం క్లారటీ లేదు. ఆ రెండు సినిమాలూ ఇంకా షూటింగ్ ను పూర్తి చేసుకోలేదు.
డెకాయిట్ షూటింగ్ హీరోయిన్ మారడం వల్ల లేటవుతుంది. ముందు శృతి హాసన్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ మధ్యలో శృతి తప్పుకోవడంతో మృణాల్ జాయినైంది. క్యాస్టింగ్ ప్రాబ్లమ్ తో డెకాయిట్ లేటవుతుందని టాక్ వినిపిస్తుంది. అందుకే డెకాయిట్ ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోలేదు.
దీంతో పాటూ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న గూఢచారి2 షూటింగ్ కూడా నత్తనడకనే సాగుతుంది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి సమాంతరంగా తెరకెక్కుతుండటం వల్లే షూటింగ్ లేటవుతుందంటున్నారు. ఈ రెండు సినిమాలు 2025లోనే రిలీజవుతాయంటున్నారు ఎప్పుడనేది మాత్రం తెలియడం లేదు. సమ్మర్ వరకు ఏ స్లాట్ ఖాళీగా లేదు. పోనీ, దసరా దీపావళిలో ఏదొక సీజన్ ను చూసుకుందామనుకుంటే పాన్ ఇండియా సినిమాలు ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో శేష్ ముందుగా ఏదొక డేట్ ను ఫిక్స్ చేసుకోవడం ఎంతో అవసరం.
అయినా శేష్ అంత టాలెంట్ పెట్టుకుని సినిమా సినిమాకీ రెండేళ్ల గ్యాప్ తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. దీని వల్ల తన క్రేజ్ ను కాపాడుకోవాలనుకోవడం బానే ఉంది కానీ రెండేళ్ల వరకు శేష్ లాంటి హీరో స్క్రీన్ పై కనిపించకపోతే అందరూ తనను మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇకనైనా శేష్ తన తర్వాతి సినిమాల విషయంలో ఆలస్యం చేయకుండా ఉంటే బెటర్.