నెక్స్ట్ సెంచరీ కొట్టే స్టార్ అతడే!
ఆ రకంగా ఇండస్ట్రీలో తనని తానే సెంచరీ స్టార్ గా తీర్చిదిద్దుకున్నాడు.
By: Tupaki Desk | 10 April 2024 4:30 PM GMTకంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేకుండా సెంచరీలు కొట్టేస్తున్న రోజులివి. ఐపీఎల్ లో కొత్త ప్లేయర్లు ఎలా దంచికొడుతున్నారో? సినిమా మార్కెట్ లో కొత్తగా వచ్చిన హీరోలు అలాగే వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టిల్లుస్క్వేర్ విజయంతో సిద్దుజొన్నలగడ్డ 100 కోట్ల క్లబ్ లో చేరిన సంగి తెలిసిందే. సిద్దు సెంచరీ కొడతాడని కనీసం తాను కూడా ఊహించి ఉండడు. 50 కోట్లు సాధిస్తు 100 కోట్లతో సమానం అనుకున్నాడు. కానీ తాను అనుకున్నదానికంటే పెద్ద సక్సెస్ వచ్చింది.
ఆ రకంగా ఇండస్ట్రీలో తనని తానే సెంచరీ స్టార్ గా తీర్చిదిద్దుకున్నాడు. తనలో రైటింగ్స్ స్కిల్స్ అతన్ని పైకి లేపడం లోకీలక పాత్ర పోషించాయి అన్నది వాస్తవం. ఇతడి కంటే ముందు తేజ సజ్జ `హనుమాన్` తో పాన్ ఇండియాలో సంచలనం అయ్యాడు. అలాగే `దసరా` సినిమాతో నాని..`గీతగోవిందం`తో విజయ్ దేవరకొండ...`ఎఫ్-2` తో వరుణ్ తేజ్.. `ధమాకా` సినిమాతో రవితేజ 100 కోట్ల క్లబ్ లో ఈ మధ్య చేరిన వారే. `కార్తికేయ-2` తో నిఖల్ వంద కోట్లు సహా పాన్ ఇండియాలో పేరు తెచ్చుకున్నాడు.
ఇక తొలి సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా వందకోట్ల క్లబ్ లో చేరినవాడే. మరి ఈ రేసులో తదుపరి సెంచరీ కొట్టే స్టార్ ఎవరు? అంటే ఆ ఛాన్స్ అడవి శేషుకి ఉందని తెలుస్తోంది. గుఢచారి..హిట్..ఎవరు?..మేజర్ లాంటి సినిమాలో అడవి శేషు పేరు సంచలనమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అతడి సినిమాలు కొన్ని 50-60 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మేజర్ 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం `గుఢచారి-2` లో నటిస్తున్నాడు.
ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. రైటింగ్ లో శేష్ కి కూడా అపార అనుభవం ఉంది. తనని స్టార్ గా మార్చుకోవడంలో ఆ స్కిల్ అతడికి ఎంతో ఉపయోగపడుతోంది. `జీ-2` తో 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెడతాడు? అనే అంచనాలున్నాయి. ట్రేడ్ సైతం ఈ సినిమాతో సాధ్యమని భావిస్తోంది.