Begin typing your search above and press return to search.

అడివి శేష్ ఆలోచన మార్చిన ఆ సన్నివేశం..!

సైడ్ రోల్స్ తోనే ఒక బేస్ ఏర్పరచుకుని ఆ తర్వాత అవకాశాలు దక్కించుకుంటారు. అలా సైడ్ రోల్స్ చేసి హీరోగా మారిన వారిలో అడివి శేష్ కూడా ఉన్నారు

By:  Tupaki Desk   |   24 July 2024 2:30 AM GMT
అడివి శేష్ ఆలోచన మార్చిన ఆ సన్నివేశం..!
X

ఇప్పుడు హీరోగా చేస్తున్న చాలామంది వారి కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చితక రోల్స్ చేసిన వారే. స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తేనో లేదా కొత్త వారితో తీసే సినిమాలో ఆడిషన్ తో సెలెక్ట్ అయితేనో తప్ప మిగతా వారంతా కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ అలా ఆడియన్స్ కు పరిచయమై ఆ తర్వాత సోలో ప్రయత్నాలు చేసి సత్తా చాటుతున్నారు. సైడ్ రోల్స్ తోనే ఒక బేస్ ఏర్పరచుకుని ఆ తర్వాత అవకాశాలు దక్కించుకుంటారు. అలా సైడ్ రోల్స్ చేసి హీరోగా మారిన వారిలో అడివి శేష్ కూడా ఉన్నారు.

సొంతం సినిమాలో ఎన్నారై పెళ్లి కొడుకుగా మొదలైన అడివి శేష్ సైడ్ రోల్స్ పదుల సంఖ్యలో చేశారు. ఐతే ఒక సినిమాలో తను చేసిన పాత్ర మాత్రం తన ఆలోచన మార్చిందని అంటున్నారు. చాలా సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన అడివి శేష్ రవితేజ బలుపు సినిమాలో కూడా నటించారు. ఆ సినిమాలో తనకు నచ్చని రోల్ చేశానని చెప్పుకొచ్చారు అడివి శేష్. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన బలుపు సినిమాలో శృతి హాసన్ ను జుట్టు పట్టుకుని లాక్కెళ్లే సీన్ చేశానని. అయితే ఆ సీన్ చూస్తే నా మీద నాకే అసహ్యం వేసిందని అన్నారు. ఇలాంటి పాత్రలు చేస్తున్నానా అని అనిపించింది.

ఆ టైం లోనే ఆలోచన మార్చుకుని నెగిటివ్ రోల్స్ చేయడం మానేశానని అన్నారు. బలుపు సినిమా చేయడం వల్ల తనకు ఇద్దరు మంచి వ్యక్తుల పరిచయం దొరికిందని అన్నారు అడివి శేష్. అయితే అప్పుడు సైడ్ రోల్స్, నెగిటివ్ రోల్స్ చేసిన శేష్ ఇప్పుడు హీరోగా వరుస సూపర్ హిట్లు కొడుతున్నాడు. అడివి శేష్ సినిమా అంటే కచ్చితంగా కంటెంట్ అదిరిపోతుంది అనేట్టుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి గూఢచారి 2 కాగా మరోటి డెకాయిట్ గా రాబోతుంది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎవరైనా చేస్తారు కానీ తెలుగు ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించాలని అడివి శేష్ ప్రయత్నిస్తాడు. తీసే సినిమాలన్నీ లిమిటెడ్ బడ్జెట్ లోనే ఉంటాయి. ప్రయోగాత్మక సినిమాలు ఆడియన్స్ ని రీచ్ అయితేనే సక్సెస్ అవుతాయి. కెరీర్ మొదట్లో అతను చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఐతే కాస్త పంథా మార్చి ప్రయత్నించిన అడివి శేష్ కు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ వరుస సక్సెస్ లు అందిస్తున్నారు.