Begin typing your search above and press return to search.

మరోసారి స్టన్ అయ్యేలా తల్లికూతుళ్ళ గ్లామర్ డోస్

రెగ్యులర్ గా తమ అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా మతి పోగొట్టే పిక్స్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   5 Jan 2024 10:44 AM GMT
మరోసారి స్టన్ అయ్యేలా తల్లికూతుళ్ళ గ్లామర్ డోస్
X

సోషల్ మీడియాను హీటెక్కించడంలో ముందు వరుసలో ఉంటున్నారు తల్లీకూతుళ్లు సురేఖావాణి, సుప్రిత. రెగ్యులర్ గా తమ అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా మతి పోగొట్టే పిక్స్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ నెటిజన్లను తమదైన కోణంలో అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న సురేఖావాణి, సుప్రిత అప్పుడప్పుడూ ఊహించని పిక్స్ ను షేర్ చేస్తుంటారు.


తాజాగా ఓ నైట్ పార్టీలో కనిపించి సుప్రిత తన తల్లితో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ పంచుకుంది సుప్రిత. ఓ హోటల్ బయట కెమెరా ముందు గ్లామర్ కిక్కిస్తూ ఫొటోలకు తల్లీకూతుళ్లు పోజులిచ్చారు. ఈ పిక్స్ లో సూపర్ గా కనిపించి అట్రాక్ట్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో అందాలను ఆరబోశారు. కుర్రకారును ఫిదా చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి.


సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి ఎప్పటికప్పుడూ చిల్ అవుతూనే ఉంటారు. టైమ్ దొరికితే చాలు ఇద్దరు కూడా టైమ్ ను సృలబ్రెట్ చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ వుంటారు. తమ గ్లామర్ డోస్ యాడ్ చేసి రచ్చ రచ్చ చేస్తుంటారు.


ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. పొట్టి పొట్టి దుస్తులతో యువతను ఎట్రాక్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి ఫొటోలతో సుప్రిత ఎన్నోసార్లు ట్రోల్ల్స్ కు గురైంది. ఎంతమంది ఎలా ట్రోల్ చేసిన తన లైఫ్ తన ఛాయిస్ అన్నట్లుగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియా కామెంట్స్ హిడెన్ చేసి తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు బ్రేక్ వేసింది.

అంతకుముందు తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే. ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లో క్లిక్ కాకముందే బాగా పాపులర్ అయింది సుప్రిత. సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తూ భారీ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించింది. దీంతో ఆమె ఫొటోస్ ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.