బ్యూటీ ఉత్పత్తుల వ్యాపారంలో సినీతారలు
శృంగార తార సన్నీలియోన్ సౌందర్య ఉత్పత్తుల రంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Jun 2024 5:47 AM GMTతమదైన అందం ప్రతిభతో అత్యంత జనాకర్షణ కలిగిన తారలుగా ఏలిన కొందరు సొంతంగా కాస్మోటిక్స్ వ్యాపారంలో అడుగుపెట్టి కోట్లలో ఆర్జిస్తున్నారు. ఇటీవల డజను పైగానే నటీమణులు కొత్త సంస్థల్ని స్థాపించి వ్యవస్థాపకులుగా మారారు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలోకి ప్రవేశించడమే గాక ప్రజలకు టిప్స్ ని అందిస్తున్నారు. ముఖ్యంగా చర్మ సంరక్షణ, అందం విషయంలో వారి ప్రభావాన్ని అభిరుచిని ప్రతిబింబించేలా ఉత్పత్తులను ప్రారంభించారు. అందం సంరక్షణ మార్గాలను ప్రారంభించిన కొందరు నటీమణుల జాబితాను పరిశీలిస్తే.. ఇందులో దీపిక పదుకొనే, నయనతార, ప్రియాంక చోప్రా, కత్రిన కైఫ్, కృతి సనోన్ లాంటి అగ్ర నాయికలు ఉన్నారు. శృంగార తార సన్నీలియోన్ సౌందర్య ఉత్పత్తుల రంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.
పాపులర్ కథానాయిక దీపిక పదుకొనే ఇటీవలే విడదలైన బ్లాక్ బస్టర్ మూవీ 'కల్కి 2898 ఏడి'లో నటించింది. ఈ సినిమాలో దీపిక పాత్రకు, నటనకు అద్భుత స్పందన వచ్చింది. ద్రౌపది తరహా సస్పెన్స్ ఉన్న పాత్రలో మెప్పించిందంటూ నెటిజనుల్లో టాక్ నడుస్తోంది. దీపిక కేవలం నటి మాత్రమే కాదు.. వ్యాపారవేత్తగాను రాణిస్తోంది. దీపికా పదుకొణె 2022లో 82.E అనే బ్యూటీ కేర్ బ్రాండ్ ని ప్రారంభించారు. 82 డిగ్రీల తూర్పున ఉన్న భారతదేశ రేఖాంశం నుండి ప్రేరణ పొందిన ఈ బ్రాండ్ స్వీయ-సంరక్షణ అభ్యాసాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రీమియం బ్రాండ్స్.. ఉత్తమ పనితీరు గల ఉత్పత్తులను అందించే సంస్థ ఇది. 82e.official పేరుతో ఇన్ స్టా యువతరంలో బాగా పాపులర్ అయింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార సెప్టెంబర్ 2023లో 9SKIN పేరుతో తన చర్మ సంరక్షణ బ్రాండ్‌ను ప్రారంభించింది. దీనికోసం భర్త విఘ్నేష్ తో కలిసి కోట్లాది రూపాయల పెట్టుబడుల్ని సమకూర్చిందని కథనాలొచ్చాయి. నయన్ ప్రారంభిచిన ఉత్పత్తులలో సరసమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి. నయనతార పేరుతోనే ఇన్ స్టాలో ఈ ఈ బ్రాండ్ కి విస్త్రత ప్రచారం దక్కుతోంది.
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్ `అనోమలీ` అనే స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. దీనిలో ఉత్పత్తుల శ్రేణి విశిష్ఠతను.. సుస్థిరత, సమగ్రతను ప్రచారంలో హైలైట్ చేస్తున్నారు. కత్రినా కైఫ్ 2019లో కే బ్యూటీని స్థాపించారు. క్లెన్సర్‌లు, మాయిశ్చరైజర్‌లు, మాస్క్‌లు వంటి చర్మ సంరక్షణ ఉత్పతులను మార్కెట్లోకి తెచ్చారు. క్లీన్ బ్యూటీ ఉత్పత్తులపైనా ఈ బ్రాండ్ దృష్టి సారించింది. కేబై కత్రిన పేరుతో ఇన్ స్టాలో ఇది పాపులరైంది.
బాలీవుడ్ సహా టాలీవుడ్ లోను భారీ చిత్రాలలో నటించింది కృతి సనోన్. ఇటీవలే మిలీ చిత్రంలో నటనకు కృతికి జాతీయ అవార్డు దక్కింది. కృతి తన 33వ పుట్టినరోజున `హైఫన్`ని ప్రారంభించింది. ఇది ఛర్మ సౌందర్య ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశ పెడుతోంది. ఈ బ్రాండ్ మూడు సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటుంది. పెటా-సర్టిఫైడ్ వెజ్ ఉత్పత్తులను అందిస్తుంది. kritisanon పేరుతోనే ఇన్ స్టాలో ఈ ఉత్పత్తుల ప్రచారం సాగుతోంది.
వీరితో పాటు, పాపులర్ కథానాయికలు అనుష్క శర్మ, సోనమ్ కపూర్, సమంత రూత్, ఆలియా భట్ ప్రభు సహా చాలా మంది దుస్తుల వ్యాపారంలో తలమునకలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆలియా భట్ ఇటీవలే ముఖేష్ అంబానీ కుమార్తెతో కలిసి భారీ వ్యాపారంలోకి ప్రవేశించింది. షాహిద్ కపూర్ భార్య మీరా చోప్రా కూడా అంబానీ వారసులతో కలిసి భారీ కంపెనీని విస్తరిస్తోంది.